వర్షాకాలంలో పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. పెద్దల కంటే పిల్లలపై వైరస్, బాక్టీరియాలు ఎక్కువగా వ్యాపిస్తాయి.

pexels

By Bandaru Satyaprasad
Jul 02, 2024

Hindustan Times
Telugu

పిల్లలు అనారోగ్యం బారిన పడుకుండా ఉండేందుకు ఈ మాన్‌సూన్ చిట్కాలను పాటించండి.  

pexels

సమతుల ఆహారం- పిల్లలు ఏడాది పొడవునా మంచి, సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక వర్షాకాలం పిల్లల ఆహారంలో తాజా ఆకు కూరలు, పండ్ల రసాలు చేర్చండి. అల్లం, తులసి, తేనె, పసుపు, నిమ్మ, బత్తాయి వంటివి పిల్లల ఆహారంలో చేర్చితే మంచిది.   

pexels

ప్రాసెస్ ఫుడ్స్ వద్దు - వర్షాకాలంలో అనేక వ్యాధులు నీటి సంక్రమిస్తాయి. ఈ సీజన్ లో స్ట్రీట్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. తేమ, తడి వాతావరణం బ్యాక్టీరియా పెరడానికి అనువైనది కాబట్టి ఇంట్లో వండిన భోజనమే బెస్ట్.   

pexels

వ్యక్తిగత పరిశుభ్రత- పిల్లలకు తరచూ చేతులు శుభ్రం చేస్తూ ఉండండి. రోజువారీ స్నానాలతో సహా పరిశుభ్రత చర్యలు పాటించండి. పిల్లలు బయటి నుంచి వచ్చినప్పుడు చేతులను సరిగ్గా కడుక్కోవాలని సూచించండి. 

pexels

పిల్లల కోసం రెయిన్ గేర్-  పిల్లలకు గొడుగులు, రెయిన్‌కోట్లు, బూట్లు అవసరం. స్కూల్స్ కు వెళ్లేటప్పుడు లేదా బయట ఆడుకునేటప్పుడు వీటిని తప్పనిసరిగా ఉపయోగించండి. పిల్లలు వర్షంలో తడవకుండా జాగ్రత్త పడండి.   

pexels

దోమలు కుట్టకుండా రక్షణ - వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతాయి. దోమలు డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతాయి. పిల్లలను దోమలు కుట్టకుండా నిండుగా దుస్తులు, రాత్రిపూట దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్ క్రీములను ఉపయోగించండి.   

pexels

రెగ్యులర్ టీకాలు- పిల్లలకు రెగ్యులర్ గా టీకాలు వేయించండి. పిల్లలను అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు, బంధువుల నుంచి దూరంగా ఉంచాలి. వారి నుంచి పిల్లలకు వ్యాధులు సోకే అవకాశం ఉంది. వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోండి.  

pexels

పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?