గుండె జబ్బుల్లో  మెటబాలిక్‌ సిండ్రోమ్‌ లక్షణాలు గుర్తించడం ఎలా...

By Bolleddu Sarath Chandra
Jan 20, 2025

Hindustan Times
Telugu

మెటబాలిక్‌ సిండ్రోమ్‌ను మొదట సిండ్రోమ్ ఎక్స్‌గా పరిగణించారు. గత 30ఏళ్లలో వైద్య శాస్త్రం సాధించిన  ప్రగతిలో సిండ్రోమ్‌ ఎస్‌ గుర్తింపు ఒకటి...

ఆహార పదార్ధాల్లో కొవ్వులు అధికంగా తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడం, ఫలితంగా కొలెస్ట్రాల్  పెరిగిపోతుంది. 

గుండె జబ్బులు రాక ముందు మెటబాలిక్ సిండ్రోమ్ ద్వారా కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు.

2005లో జరిగిన నేషనల్ కొలెస్ట్రాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం  ద్వారా కొన్ని నిర్దిష్ట లక్షణాల ద్వారా మెట్‌ సిండ్రోమ్‌ను గుర్తించవచ్చని నిర్దారించారు. 

పరగడుపున శరీరంలో గ్లూకోజ్‌  మందులు వాడినా వాడకపోయినా 100కు మించి ఉంటే మెట్‌ సిండ్రోమ్‌ లక్షణంగా గుర్తించాలి. 

రక్తపోటు సిస్టోలిక్‌ 130, డయాస్టోలిక్‌ 85కంటే ఎక్కువ ఉంటే మెట్‌ సిండ్రోమ్‌గానే భావించాలి. 

ఊబ పొట్ట, బొడ్డు చుట్టుకొలత పురుషుల్లో 40 అంగుళాలు, స్త్రీలలో 35 అంగుళాలు దాటితే దానిని  మెట్‌ సిండ్రోమ్‌గానే పరిగణిస్తారు. 

హై డెన్సిటీ లిపో  ప్రొఫైల్‌ పురుషుల్లో 40 మిల్లీ గ్రాములు, స్ల్రీలలో  50 మిల్లీ గ్రాములు కన్నీ తక్కువ ఉండటం కూడా సిండ్రోమ్ లక్షణమే

శరీరంలో ట్రై గ్లిజరాయిడ్స్‌  150 దాటితే  మెటబాలిక్ సిండ్రోమ్‌గా గుర్తించాలి. 

మధుమేహం, రక్తపోటు, కొలస్ట్రాల్ మందులు వాడుతున్నా మెట్‌ సిండ్రోమ్‌ లక్షణాలు ఉన్నట్టుగానే భావించాలి.

శరీరంలో ట్రై గ్లిజరాయిడ్లు పెరగడానికి , గుండె రక్త నాళాల జబ్బులకు దగ్గర సంబంధం ఉందని పరిిశోధకులు గుర్తించారు.  అయితే ట్రై గ్లిజరాయిడ్లు అధికంగా పెరగడానికి కొవ్వులు కారణం కాదుే. శరీరంలో పిండి పదార్ధాలు అధికంగా తినడం, ఇన్సులిన్ ఎక్కువ కావడం కారణంగా గుర్తించారు. 

శరీరంలో ఇన్సులిన్ పెరగడానికి, రక్తపోటుకు మధ్య కూడా సంబంధం ఉంటుంది. 

మెట్ సిండ్రోమ్‌ ఉన్న వారిలో అధిక గ్లూకోజ్‌, ఇన్సులిన్ నిరోధకత,  సెంట్రల్ ఒబెసిటీ, ఊబపొట్ట, హైబీపీ ఉంటాయి. 

బిఎంఐ లెక్కల ప్రకారం ఊబకాయం ఉన్నవారిలో  మెటబాలిక్ సిండ్రోమ్‌ తప్పకుండా ఉంటుంది. 

మెటబాలిక్‌ సిండ్రోమ్‌లో  ప్రధాన సమస్య ఊబకాయం కాదు, ఊబ పొట్టే ఈ లక్షణాలకు ప్రధాన కారణంగా వైద్యులు గుర్తించారు. ఇది అంతిమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది. 

కార్తీక దీపం 2 సీరియ‌ల్‌లో జ్యోత్స్న‌గా విల‌న్ పాత్ర‌లో యాక్టింగ్‌తో అద‌ర‌గొడుతోంది గాయ‌త్రి సింహాద్రి.

Instagram