ఇటీవల ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మెడికల్ షాప్ కు పరిగెడుతున్నాం. కానీ ఒకప్పుడు ఇంటి వైద్యానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. జలుబు, దగ్గు, జ్వరం ఇలా చిన్న చిన్న రోగాలకు మన పెరట్లో ఔషధాలే వాడేవాళ్లం.
pexels
By Bandaru Satyaprasad Aug 14, 2024
Hindustan Times Telugu
జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, గ్యాస్ వంటి చిన్న ఆరోగ్య సమస్యలకు మందులు అవసరం లేకుండా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అయితే మీరు కచ్చితంగా మీ పెరట్లో ఈ ఔషధ మొక్కలను పెంచాల్సి ఉంటుంది.
pexels
కలబంద- ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క కలబంద. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కాలిన గాయాలు మానడానికి, బరువు తగ్గేందుకు, జుట్టు, చర్మ సంరక్షణకు కలబంద అద్భుతంగా ఉపయోగపడుతుంది.
pexels
వాము- ప్రతి పెరట్లో వాము మొక్క తప్పనిసరిగా ఉండాలి. వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి సమస్యలను వాముతో నయం అవుతాయి. వాము ఆకులు మరిగించిన నీటిని రోజు తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
twitter
కరివేపాకు- కరివేపాకు వంటల రుచిని పెంచుతుంది. దీంతో పాటు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుంది. రోజూ కరివేపాకు తీనడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణ, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది.
twitter
తులసి- ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషధ మొక్క తులసి. తులసిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తులసి ఆకులతో చేసిన టీ నిత్యం తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తులసితో అనే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
pexels
అల్లం - అల్లం నిత్యం మన వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లం జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శరీర నొప్పులను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
pexels
మునగ- మునగ మొక్క పెరట్లో కచ్చితంగా ఉండాలి. మునగలో కాల్షియం, ఇనుము, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మునగలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
twitter
బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నది సోనియా ఆకుల.