మీ వైవాహిక జీవితం సరిగ్గా లేదా? తరచూ గొడవలు పడుతున్నారా? ఏ సంబంధం వంద శాతం పర్ఫెక్ట్ కాదు కానీ విషపూరిత సంబంధాలను ఈ సూచనలతో గమనించవచ్చు.
pexels
By Bandaru Satyaprasad Dec 09, 2023
Hindustan Times Telugu
ప్రవర్తనలను నియంత్రించడం - నియంత్రణ అనేది వివాహ బంధం చెడిపోవడానికి ముఖ్య సూచిక. ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నా లేదా వారి తరపున నిర్ణయాలు తీసుకున్నా, అధిక నియంత్రణ వివాహ సంబంధం దెబ్బతింటుంది.
pexels
నమ్మకం లేకపోవడం - తరచూ అనుమానించడం, ప్రశ్నించడం, అవతలి వ్యక్తి చర్యలను పర్యవేక్షించడం అనేది అభద్రత, ఆందోళనకు దారితీసే విఫలమైన సంబంధాన్ని సూచిస్తుంది.
pexels
నిజాయితీ- నిజాయితీ ఆరోగ్యకరమైన బంధానికి మూలస్తంభం. భార్యాభర్తలపై ఒకరికి ఒకరిపై అభద్రత, నమ్మకం లేకపోవడం టాక్సిక్ రిలేషన్ కు దారితీస్తుంది.
pexels
తరచూ గొడవలు- వివాహ బంధంలో భార్యాభర్తల కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అయితే తరచూ మనస్పర్థలు రావడం వివాహ సంబంధాన్ని విషపూరితం చేస్తుంది.
pexels
కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడకపోవడం - వివాహ బంధంలో ఆలుమగలు నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ ఉండాలి. దాపరికం వైవాహిక సమస్యలు పెంచుతుంది.
pexels
కాన్ స్టెంట్ డ్రామా- ఆరోగ్యకరమైన సంబంధాలు రాజీపడడం, అవగాహనను కలిగి ఉంటాయి. కానీ విషపూరిత సంబంధాలలో డ్రామా పునరావృతమవుతుంది. తరచూ సమస్యలతో మానసిక సమస్యలు వస్తాయి
pexels
గ్యాస్‌లైటింగ్- గ్యాస్‌లైటింగ్ అనేది ఒక మానిప్యులేటివ్ వ్యూహం. దీనిలో భాగస్వామి నిజాలు దాస్తుంటారు. భాగస్వామి అభిప్రాయాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల వారి ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలను అనుమానిస్తారు.