పిల్లలు పుట్టకపోవడాన్ని మహిళల సమస్యగానే చూస్తుంటారు. అయితే మగవాళ్లలో కూడా సంతానలేమి సమస్యలు అధికంగానే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తు్న్న వారిలో 30 శాతం మగవారు ఉన్నాయని తెలుస్తోంది.
pexels
By Bandaru Satyaprasad Jan 18, 2025
Hindustan Times Telugu
సంతానలేమి సమస్యల్లో ప్రధానకారణం వీర్య కణాల సంఖ్య తగ్గడం. ప్రపంచవ్యాప్తంగా మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
pexels
మగవారి జీవనశైలి, పర్యవరణ మార్పులు సంతానలేమి కారణాలు కావొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే జాగ్రత్తలతో వీర్య కణాల ఉత్పత్తిని, సంతాన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
pexels
ఊబకాయం హార్మోన్ల విడుదలపై ప్రభావం చూపుతుంది. ఇది వీర్య కణాలపై ప్రభావం చూపుతుంది. ఊబకాయం వల్ల వీర్య కణాల ఆకారం సజావుగా లేకపోవటంతో గర్భధారణలో ఇబ్బందులు తలెత్తుతాయి.
pexels
బరువు తగ్గే ప్రయత్నాలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా వీర్య కణాల నాణ్యత మెరుగుపడుతుంది. గింజ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, క్రీమ్ లేని పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది.
pexels
సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పొగతాగే మగవారిలో సంతాన సామర్థ్యం తగ్గుతుంది. పొగ తాగటం వల్ల శుక్ర కణాల సంఖ్య తగ్గిపోతుంది. వీర్య కణాల చురుకుదనం తగ్గి గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి.
pexels
మత్తు పదార్థాలు వీర్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు వీర్యం ఉత్పత్తి, వీర్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. గంజాయి వాడే వారిలో వీర్యం నాణ్యత దెబ్బతినటమే కాకుండా వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
pexels
శరీర సామర్థ్యం, ఆకృతిని మెరుగుపరచుకోవటానికి కొందరు కృత్రిమ టెస్టోస్టీరాన్ వంటి స్టిరాయిడ్స్ వాడుతుంటారు. ఇవి కండరాల వృద్ధికి, కొవ్వు తగ్గటానికి తోడ్పడినప్పటికీ వృషణాల సైజు తగ్గి, వీర్యం ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవటానికి దారితీయవచ్చు. శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది.
pexels
నిత్యం మనం ఎన్నో కాలుష్య కారకాల ప్రభావానికి గురవుతుంటాం. ఆహారం, నీరు, గాలి ద్వారా కాలుష్య కారకాలు మన శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి. ఇవి వీర్యం నాణ్యతను దెబ్బతీయవచ్చు. సెక్స్ హార్మోన్లను అడ్డుకోవటంతో సంతాన సామర్థ్యాన్ని తగ్గించొచ్చు.
pexels
ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం