ముంబై స్టైల్ వడా పావ్ రెసిపి ఇలా చేయండి

By Haritha Chappa
Feb 05, 2025

Hindustan Times
Telugu

వడా పావ్ మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబైలో చాలా ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ ఫుడ్. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా లభిస్తుంది.

టేస్ట్ అట్లాస్ ప్రకారం ప్రపంచంలోని 50 బెస్ట్ శాండ్ విచ్ లలో వడా పావ్ ఒకటి.

దీనికోసం శెనగ పిండి, ఉడికించిన బంగాళాదుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి-అల్లం పేస్ట్, ఆవాలు, కరివేపాకు, నిమ్మకాయ, పసుపు, రుచికి తగినంత ఉప్పు, పావ్ కావాలి.

బంగాళాదుంపలను మెత్తగా ఉడకబెట్టి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి కలపాలి.

స్టవ్ మీద కళాయి పెట్టేి  నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, కరివేపాకులు వేసి  బంగాళాదుంపలు మెత్తగా మెదిపి వేయాలి.

శెనగ పిండిలో ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి పిండిలా కలపాలి. బంగాళాదుంప మిశ్రయాన్ని ఒక  ముద్దలా చేసి దాన్ని శెనగ పిండిలో ముంచి నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వడా రెడీ అయినట్టే

వడను పావ్ కట్ చేసి మధ్యలో ఉంచి  పుదీనా చట్నీతో ఆస్వాదించాలి. రుచి అద్భుతంగా ఉంటుంది.

జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.