పరీక్షల సమయంలో పిల్లలకు వీటిని కచ్చితంగా తినిపించండి
pixabay
By Haritha Chappa Feb 15, 2025
Hindustan Times Telugu
పరీక్షల సమయం దగ్గరపడుతున్నందున, విద్యార్థులు చదువులో ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
pixabay
ఎక్కువసేపు చదివినప్పుడు అలసట వస్తుంది. ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది. ఇవి మెదడు పనితీరు, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
pixabay
పరీలక్షల సమయంలో పిల్లల మెదడు శక్తిని పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని వారికి కచ్చితంగా తినిపించండి.
pixabay
బాదం, అక్రూట్, గుమ్మడికాయ గింజల్లో ఒమేగా -3, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు శక్తిని పెంచుతాయి.
pixabay
పెరుగు ప్రేగు ఆరోగ్యానికి మంచిది. దీనితో పాటు, తేనె తీసుకోవడం ఆరోగ్యకరమైన కొవ్వులను జోడిస్తుందని చెబుతారు. కాబట్టి పెరుగులో ఒక స్పూను తేనె వేసి పిల్లలకు ఇవ్వండి.
pixabay
అవకాడో పండ్లు మెదడు పనితీరును పెంచుతాయి. బ్రౌన్ బ్రెడ్ మధ్యలో అవకాడో పేస్టును పెట్టి టోస్ట్ లా చేసి తినడం మంచిదని నమ్ముతారు.
pixabay
శనగలతో తయారుచేసిన ఆహాారాలను వల్ల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ఇది మెదడుకు కావాల్సిన ఆహారం. అలాగే క్యారెట్, వెల్లుల్లి కూడా తినవచ్చు.
pixabay
చదువుతున్నప్పుడు గ్రీన్ టీ, బాదం తినడం మంచిదని చెబుతారు.
pixabay
ఆరోగ్యానికి 5 మెట్లు
సరైన ఆరోగ్యం, ఉత్సాహపూరిత జీవన శైలి కోసం ఈ ఐదింటిని పాటించండి..