మెరిసే చర్మం కోసం ఇంట్లోనే ఇలా గులాబీల క్రీమ్ చేసేయండి

By Haritha Chappa
Jan 18, 2025

Hindustan Times
Telugu

చలికాలంలో చర్మం పొడిబారడం సర్వసాధారణం. చర్మంలో తేమ ఉండేలా ఫేస్ క్రీమ్ ను రెగ్యులర్ గా అప్లై చేయాలి.

స్కిన్ టైప్ ను బట్టి మార్కెట్ లో రకరకాల క్రీములు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంట్లోనే కెమికల్ ఫ్రీ క్రీములు తయారు చేసుకోవచ్చు. 

గులాబీ రేకులను అనేక చర్మ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. వాటితో మీరు సులభంగా ఫేస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. 

ముందుగా గులాబీ రేకులను కడిగి ఆ తర్వాత రోజ్ వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. 

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి, అందులో అలోవెరా జెల్, గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఇది క్రీమీగా ఉండాలి. 

ఇప్పుడు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. దీన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు అప్లై చేయవచ్చు. 

ఇది మరీ జిగటగా ఉండదు. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. 

మీరు ఈ గులాబీ క్రీమ్ ఉపయోగించాక కొన్ని రోజుల్లోనే మీకు మంచి మార్పులు కనిపిస్తాయి.

కార్తీక దీపం 2 సీరియ‌ల్‌లో జ్యోత్స్న‌గా విల‌న్ పాత్ర‌లో యాక్టింగ్‌తో అద‌ర‌గొడుతోంది గాయ‌త్రి సింహాద్రి.

Instagram