శరీరంలో 300కి పైగా జీవరసాయన ప్రతిచర్యలకు మెగ్నీషియం అవసరం. ఆరోగ్యకరమైన కండరాల పనితీరు, నరాల సిగ్నలింగ్, శక్తి ఉత్పత్తికి ఇది ముఖ్యమైన ఖనిజం. మెగ్నీషియం అధికంగా ఉండే 10 ఆహార పదార్థాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Jul 29, 2024

Hindustan Times
Telugu

గింజలు  - బాదం, జీడిపప్పు, గుమ్మడి కాయ గింజలు మెగ్నీషియం మూలాలు. వీటిని స్నాక్స్ గా ఆస్వాదించవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు.  

pexels

ఆకు కూరలు - బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్ వంటి ఆకు కూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని సలాడ్స్, స్మూతీస్, స్టైర్ ఫ్రైస్ లలో ఉపయోగించవచ్చు.  

pexels

చిక్కుళ్లు - బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, కాయ ధాన్యాలు, బఠానీలు, చిక్ పీస్ తో సహా చిక్కుళ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని ప్రోటీన్ ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించవచ్చు.  

pexels

తృణధాన్యాలు - బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  

pexels

అరటి పండు - అరటి పండ్లు పొటాషియం మాత్రమే కాకుండా మెగ్నీషియంను కలిగి ఉంటాయి. వీటిని ఆరోగ్యకరమైన చిరుతిండిగా చెప్పవచ్చు.  

pexels

ఫ్యాటీ ఫిష్ - సాల్మన్, మాకేరెల్ వంటి చేపలు మెగ్నీషియానికి మంచి మూలాలు. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.  

pexels

అవకాడోలు - అవకాడోలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని సలాడ్ లు, స్పైడ్ లు, స్మూతీస్ లో ఉపయోగించవచ్చు.  

pexels

డార్క్ చాక్లెట్ - కనీసం 70 శాతం కోకో కంటెంట్ తో ఉన్న డార్క్ చాక్లెట్ లో మెగ్నీషియానికి మంచి మూలాలు. దీనిని పరిమితంగా తీసుకోవాలి.  

pexels

టోఫు, సోయా ఉత్పత్తులు - మీ శరీరంలో మెగ్నీషియం పెంచుకోవడానికి టోఫు, సోయా ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోండి. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్లు.  

pexels

పాల ఉత్పత్తులు - పెరుగు, పాలు వంటి పాల ఉత్పత్తులు మెగ్నీషియానికి మంచి మూలాలు.  

pexels

మీకు నరాల బలహీనత సమస్య ఉందా.. అయితే ఇవి తినండి

Image Source From unsplash