బ్లడ్ ప్రెజర్ ఉందా! సోడియం తక్కువగా ఉండే ఈ స్నాక్స్ తినడం బెస్ట్

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 12, 2025

Hindustan Times
Telugu

బ్లడ్ ప్రెజర్ (బీపీ) ఎక్కువగా ఉన్న వారు ఆహారం విషయం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీని పెంచే వాటిని తీసుకోకూడదు. ఇది ఎక్కువైతే ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా బ్లడ్ ప్రెజర్ ఉన్న వారు సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తినాలి. 

Photo: Pexels

స్నాక్స్ తినాలనిపిస్తే ఏవి పడితే వాటిని బీపీ ఉన్న వారు తీసుకోకూడదు. సోడియం తక్కువగా ఉండే వాటినే తీసుకోవడం మంచిది. అలాంటి ఐదు రకాల స్నాక్స్ ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ఉడికించిన శనగల్లో కొన్ని రకాల కూరగాయల ముక్కలు వేసి, నిమ్మరసం పిండుకొని తినాలి. ఇది హెల్దీ స్నాక్‍గా ఉంటుంది. ఒకవేళ ఉప్పు వేసినా చాలా తక్కువ ఉండాలి. రుచికోసం నిమ్మరసమే వాడాలి. 

Photo: Pexels

బాదం, ఆక్రోటు, గుమ్మడి గింజలు లాంటి నట్స్, సీడ్‍లను స్నాక్స్‌లా తినొచ్చు. వీటిలోనూ ఉప్పు వేసుకోకూడదు. బీపీ తగ్గడంతో పాటు పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా నట్స్, సీడ్స్ మేలు చేస్తాయి.

Photo: Pexels

బ్రడ్ ప్రెజర్ ఉన్న వారు మఖానాను వేయించుకొని తినడం కూడా మంచి ఆప్షన్. మఖానాలో సోడియం తక్కువగా ఉంటుంది. పోషకాలు మెండుగా ఉంటాయి. ఉప్పు వేసుకున్నా చాలా తక్కువగా ఉండాలి. 

Photo: Pexels

అన్‍సాల్టెడ్ పాప్‍కార్న్‌లోనూ సోడియం తక్కువగా ఉంటుంది. అంటే పాప్‍కార్న్ తయారు చేసే ప్రక్రియలో ఉప్పు వాడకూడదు. ప్లైన్ పాప్‍కార్న్ స్నాక్‍గా తీసుకునేందుకు బాగుంటుంది. బీపీ నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతుంది.

Photo: Pexels

బ్రడ్ ప్రెజర్ ఉన్న వారు రకరకాల పండ్ల ముక్కలను స్నాక్స్‌గా తినొచ్చు. వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది. పోషకాలు మెండుగా ఉంటాయి. 

Photo: Pexels

పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?