హిమోగ్లోబిన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఆహారం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.
Pixabay
By HT Telugu Desk Feb 25, 2024
Hindustan Times Telugu
పాలకూర, బచ్చలికూర: పాలకూర, బచ్చలి కూరలో ఉండే ఐరన్, ఫొలేట్, విటమిన్ సీ వంటి పోషకాలు హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతాయి. ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తే, విటమిన్ సీ ఐరన్ శోషణకు తోడ్పడుతుంది.
Pixabay
పప్పులు: విభిన్న రకాల పప్పు ధాన్యాల్లో ప్లాంటు ఆధారిత ప్రోటీన్ లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదపడుతుంది.
Pixabay
బీట్‌రూట్: బీట్‌రూట్‌లో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్, యాంటాక్సిడెంట్లు హిమోగ్లోబిన్ పెంచుతాయి. సలాడ్స్‌లో గానీ, జ్యూస్ రూపంలో గానీ తీసుకోవచ్చు.
Pixabay
దానిమ్మ పండ్లు: వీటిలో ఉండే ఐరన్, విటమిన్ సీ, యాంటాక్సిడెంట్లు హిమోగ్లోబిన్ పెంచుతాయి.
Pixabay
చేపలు: నూనె ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఐరన్, విటమిన్ బీ 12 పుష్కలంగా ఉంటుంది. ఇవి హిమోగ్లోబిన్ పెంచుతాయి.
Pixabay
గింజలు, విత్తనాలు: బాదాంలు, గుమ్మడి గింజలు, నువ్వులలో ఐరన్ పుష్కలం. హిమోగ్లోబిన్ పెంచడానికి వీటిని తీసుకోవడం సహజమైన మార్గం.
Pixabay
డార్క్ చాక్లెట్: దీనిలో ఐరన్, యాంటాక్సిడంట్లు ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతాయి.
Pixabay
డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు