డయాబెటిస్ ఉన్న వారి కోసం జీఐ తక్కువగా ఉండే 6 రకాల పండ్లు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jan 07, 2025

Hindustan Times
Telugu

డయాబెటిస్ ఉన్న వారు గ్లెసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. జీఐ ఎక్కువగా ఉండేటివి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. పండ్ల విషయంలోనూ ఇది పాటించాలి. 

Photo: Pexels

డయాబెటిస్ ఉన్న గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా అదుపులోనే ఉంటాయి. అలా జీఐ తక్కువగా ఉండే ఆరు రకాల పండ్లు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

చెర్రీల్లో గ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ పుష్కలం. అందుకే డయాబెటిస్ ఉన్న వారు చెర్రీలను తినొచ్చు. 

Photo: Pexels

యాపిల్ పండ్లలో జీఐ తక్కువగా.. ఫైబర్ మెండుగా ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్న వారు షుగర్ పెరుగుతుందనే చింత లేకుండా యాపిల్ తినొచ్చు.

Photo: Pexels

నేరేడు పండ్లు డయాబెటిస్ ఉన్న వారికి చాలా మేలు. వీటిలో గ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ.  

Photo: Pexels

బేరీ పండ్లలోనూ జీఐ అతి తక్కుగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారికి బాగా సూటవుతాయి.

Photo: Pexels

నారింజ పండ్లలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా.. విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది తిన్నా బ్లడ్ షుగర్ అమాంతం పెరగదు. డయాబెటిస్ ఉన్న వారు నారింజ తినొచ్చు.

Photo: Pexels

గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లలో స్ట్రాబెర్రీలు కూడా ఉన్నాయి. ఇందులో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్న వారి స్ట్రాబెర్రీలను తీసుకోవచ్చు. 

Photo: Pexels

రామ్‌చ‌ర‌ణ్, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో రూపొందిన గేమ్ ఛేంజ‌ర్ జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతోంది. 

twitter