గతంలో పలువురు భారతీయ హీరోలు, హీరోయిన్లు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులతో ప్రేమయాణాలు నడిపించినట్లు వార్తలు వినిపించాయి. మరి వాళ్లు ఎవరు? 

By Sanjiv Kumar
Apr 25, 2025

Hindustan Times
Telugu

ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ‌కు గీతతో రిలేషన్ ఉన్నట్లు ఆయన ఓ సందర్భంలో చెప్పినట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. 

అలాగే, అదే సమయంలో బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ రేఖను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత అవి ఊహాగానాలుగా మిగిలిపోయాయి. 

వీరితోపాటు  నటి మూన్ మూన్ సేన్ కూడా ఇమ్రాన్ ఖాన్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఈ ఊహాగానాలపై వారెవరూ నోరు విప్పలేదు. 

ఈ జాబితాలో సుస్మితా సేన్, వసీం అక్రమ్ పేర్లు కూడా ఉన్నాయి. 2008లో వీరిద్దరూ కలిసి ఓ రియాలిటీ షోలో కనిపించారు. దాంతో వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి.

సుస్మిత, వసీం రిలేషన్షిప్‌లో ఉన్నారని జోరుగా వార్తలు రావడంతో ఆ పుకార్లను హీరోయిన్ ఖండించింది. 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ నటి సోమీ అలీతో రిలేషన్ షిప్‌లో ఉన్నాడని ప్రచారం సాగింది. వీరిద్దరూ చాలా కాలంగా రిలేషన్షిప్‌లో ఉన్నట్లు సమాచారం. 

రణబీర్ కపూర్‌తో షారుఖ్ ఖాన్ రాయిస్ హీరోయిన్ మహీరా ఖాన్ దిగిన ఫోటో ఒకటి వైరల్ అయింది. దాంతో వారిద్దరిపై మధ్య  ప్రేమ ఊహాగానాలు మొదలవుతాయి. అయితే రణ్ బీర్ కేవలం స్నేహితుడు మాత్రమేనని మహిరా పేర్కొంది. 

బిపాసా బసు, 3డి నటుడు ఇమ్రాన్ అబ్బాస్‌తో సినిమా విడుదలైన తర్వాత డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. అయితే, వారెవరూ దీని గురించి ఏమీ మాట్లాడలేదు. 

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels