చాలా సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సినిమాల్లోని లిప్ లాక్ సన్నివేశాలు హైలెట్ అవుతుంటాయి.
By Sanjiv Kumar Feb 08, 2025
Hindustan Times Telugu
అయితే ఏయే సినిమాల్లో లాంగ్ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయో, ఏ హిందీ మూవీలో లాంగెస్ట్ కిస్ సీన్ ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
ముందుగా నాగన్ కీ రాగిణి సినిమా గురించి మాట్లాడుకుందా. 1933లో వచ్చిన ఈ సినిమాలో దేవికా రాణి- హిమాన్షు రాయ్ మధ్య 4 నిమిషాల నిడివి గల ముద్దు సన్నివేశం ఉంది.
ఇమ్రాన్ హష్మీ నటించిన మర్డర్ సినిమాలో పలు ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని 2 నిమిషాల నిడివితో ఉంటాయి.
అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా నటించిన 'రాజా హిందుస్తానీ' సినిమాలో రెండు నిమిషాల రన్ టైమ్‌తో కిస్సింగ్ సీన్ ఉంది.
ఆదిత్య రాయ్ కపూర్, కత్రినా కైఫ్ ల మధ్య ఫితూర్ లో 3 నిమిషాల లిప్ లాక్ సీన్ ఉంది.
రణ్ వీర్ సింగ్, అనుష్క శర్మ కూడా ఆన్ స్క్రీన్‌లో హాట్ కిస్సింగ్ సీన్స్‌లో నటించారు. బ్యాండ్ బాజా బారాత్‌లో వీరిద్దరికీ ఒక నిమిషం పాటు ముద్దు సన్నివేశం ఉంది.
జిందగీ నా మిలేగీ దోబారా చిత్రంలో 3 నిమిషాల పాటు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ కిస్ సీన్ ఉంది. అయితే, ఫైనల్ కట్‌లో దాన్ని కుదించారు.
కబీర్ సింగ్ మూవీలో
షాహిద్ కపూర్, కియారా అద్వానీల మధ్య పలు ముద్దు సన్నివేశాలు ఉన్నాయి.
గెహ్రెయాన్ సినిమాలో కొన్ని లాంగ్ కిస్సింగ్ సీన్స్ కూడా ఉన్నాయి.
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు