హైదరాబాద్ కు ఐఎండీ రెయిన్ అలర్ట్ - ఇవాళ కూడా వర్షాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 19, 2025

Hindustan Times
Telugu

హైదరాబాద్ నగరంలో ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. 

image credit to unsplash

నగరంలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఈదురుగాలుల వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో తెలిపింది.

image credit to unsplash

ఈదురుగాలులు గంటకు 30 - 40 కి.మీ వేగంతో వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

image credit to unsplash

తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

image credit to unsplash

 ఏప్రిల్ 24వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిది.

image credit to unsplash

ఇవాళ ఏపీలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రెండుమూడు చోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 

image credit to unsplash

శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,విశాఖ, తూర్పుగోదావరి ,రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

image credit to unsplash

వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels