సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సన్ స్క్రీన్ చాలా బాగా సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడాలో సరిగ్గా తెలుసుకుంటేనే ప్రయోజనాలను పొందచ్చు.
చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు కనిపించడం, సన్‌బర్న్, చర్మ క్యాన్సర్ వంటి సమస్యలకు కారణమయ్యే హానికారక UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సరైన సన్‌స్క్రీన్ వాడటం చాలా అవసరం. ముఖ్యంగా ఈ వేసవిలో సన్ స్క్రీన్ ను సరిగ్గా వాడటం ఎలాగో తెలుసుకోండి.
సన్ స్క్రీన్‌ను ఎంచుకోవడానికి ముందు మీ చర్మ రకం ఏంటో తెలుసుకోండి. దాన్ని బట్టి మీకు తగిన దాన్ని ఎంపిక చేసుకొండి. సాధారణంగా సన్ స్క్రీన్ కనీసం 30 SPF కలిగి ఉండేలా చూసుకోండి.
Shutterstock
సరైన పద్ధతిలో సన్ స్క్రీన్ అప్లై చేయండి. అంటే చేత్తో రుద్దేయకుండా కేవలం రెండు వేళ్లతో(చూపుడు వేలు, మధ్య వేలి)పై సన్‌స్క్రీన్ పిండి ముఖానికి అప్లై చేయండి.
Shutterstock
చేతులు, మెడ వంటి సూర్యుడి కిరాణాలు తాకే ప్రాంతాల మీద సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోకండి. చాలా మంది ముఖం మీద మాత్రమే దృష్టి పెట్టి, ఇతర ప్రాంతాలను మర్చిపోతారు.
Shutterstock
బయటకు వెళ్లేడానికి ముందు వెంటనే సన్‌స్క్రీన్ అప్లై చేయకండి. వెళ్లడానికి కనీసం 20 నిమిషాల ముందు రాసుకోండి.అప్పటికి అది శోషించబడి పనిచేయడం ప్రారంభిస్తుంది.
Shutterstock
చర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ అప్లై చేసుకోండి. నూనెలు, పర్యావరణ కారకాలు సన్‌స్క్రీన్‌ను కాలక్రమేణా దెబ్బతీస్తాయి.కనుక మైరుగైన ఫలితాల కోసం మళ్లీ రాసుకోవడం మంచిది.
Shutterstock
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Shutterstock
సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి