వేధించే కీళ్ల నొప్పులకు ఆహారపు అలవాట్లకు మధ్య సంబంధం ఏమిటి..?

By Sarath Chandra.B
May 22, 2025

Hindustan Times
Telugu

కీళ్ల వాతం లేదా కీళ్ల నొప్పుల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఆస్టియో అర్థరైటిస్‌, రెండోది  రుమటాయిడ్‌ అర్థరైటిస్‌.. 

ఆస్టియో అర్థరైటిస్‌ వయసు మళ్లిన వారికి, జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉన్న వారికి, మలబద్దకం ఉన్న వారికి వస్తుంది.

భారతదేశంలో నూటికి పదిమందిలో ఆస్టియో అర్థరైటిస్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. 

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కీళ్లు వాచి విపరీతం బాధిస్తాయి.  కీళ్లు వంచడం, నడవడం కష్టం అవుతుంది. 

కీళ్ల నొప్పులకు ప్రధానంగా జీర్ణ వ్యవస్థలో లోపాలు, మల విసర్జన సక్రమంగా జరగక పోవడం వల్ల వ్యర్థ పదార్ధాలను మూత్ర పిండాలు పూర్తిగా వడకట్టలేకపోవచ్చు. 

యూరిక్ యాసిడ్‌ వంటి కీళ్లలో పేరుకుని నొప్పులకు కారణం అవుతాయి. కీళ్లు వాయడానికి యూరిక్ యాసిడ్ ప్రధాన కారణంగా పనిచేస్తుంది. 

జీర్ణ వ్యవస్థలో ఆమ్లం సమతూకంలో ఉండటం, తేన్పులు, గ్యాస్‌ వంటివి లేకుండా చూసుకోవాలి. 

కీళ్ల నొప్పుల నివారణలో  ఉమ్మెత్త, వావిలి, అడ్డసర, పుదీనా, కాజీపుట్‌, తూలం, కార్పురం, గుగ్గిలం వంటివి చక్కగా పనిచేస్తాయి. 

తాజా ఆకు కూరలు , కూరగాయలు,  పండ్లు తినే వారిలో కీళ్ల నొప్పుల సమస్య తక్కువగా ఉంటుంది. 

కీళ్ల నొప్పుల నివారణలో కాల్షియం, విటమిన్ డి కీలకంగా పనిచేస్తాయి. కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ లోపంతో కీళ్ల నొప్పులు రావొచ్చు.

ఆహారంలో తగినంత విటమిన్‌ సి తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. ఆహారంలో విటమిన్‌ సి తో పాటు దుంపల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఈ నొప్పుల్ని అధిగమించ వచ్చు. 

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels