బీచ్‍లో గ్లామరస్‍గా మెరిపించిన కుషిత..ఈ బ్యూటీ చేస్తున్న బోల్డ్ సిరీస్ ఏదంటే..

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
May 05, 2025

Hindustan Times
Telugu

యంగ్ బ్యూటీ కుషిత కల్లపు.. సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. తరచూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటూ మస్త్ యాక్టివ్‍గా ఉంటారు. తాజాగా బీచ్‍లో ఎంజాయ్ చేశారు కుషిత.

Photo: Instagram

బీచ్‍లో తాను సంతోషంగా గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో నేడు పంచుకున్నారు కుషిత. సముద్రపు ఒడ్డున కుర్చీలో కూర్చొని కూడా పోజులు ఇచ్చారు. 

Photo: Instagram

బ్లూ కలర్ షేడ్ టాప్, దానికి మ్యాచ్ అయ్యే బ్లాక్ ప్యాంట్ ధరించి సింపుల్ లుక్‍లో కనిపించారు కుషిత. గ్లామరస్‍గా  మెప్పించారు. క్యూట్ స్మైల్‍తో ఈ బ్యూటీ ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

కుషిత కల్లపు ప్రస్తుతం 3రోజెస్ వెబ్ సిరీస్ రెండో సీజన్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ బోల్డ్ రొమాంటిక్ సిరీస్‍లో లీడ్‍ రోల్‍లో నటిస్తున్నారు. ఆహా ఓటీటీలో ఈ 3రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్‍కు వస్తుంది. కొత్త రోజ్ అంటూ రీసెంట్‍గానే కుషిత పేరును ఈ సీజన్‍కు ప్రకటించింది ఆహ. 

Photo: Instagram

నీతో నేను (2023) అనే సినిమాతో కుషిత సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. చాంగురే బంగారు రాజా, బాబు నంబర్ వన్ బుల్‍షిట్ గాయ్ చిత్రాల్లో ఈ బ్యూటీ నటించారు.

Photo: Instagram

హైదరాబాద్‍లో ఓ పబ్ కేసు తర్వాత కుషిత కల్లపు మరింత ఫేమస్ అయ్యారు. బజ్జీలు తినేందుకు తాము పబ్‍కు వెళ్లామని చెప్పడంపై అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. బజ్జీల పాప అంటూ నెటిజన్లు ఈ బ్యూటీకి పేరు పెట్టారు.

Photo: Instagram

శని దోషం తొలగిపోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!