తెలుగు ప్రజలకు ఉగాది ప్రత్యేక పండుగ. తెలుగు సంవత్సరాదిగా ఉగాదిని పిలుస్తారు. షడ్రుచులతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు.   

facebook

By Bandaru Satyaprasad
Apr 02, 2024

Hindustan Times
Telugu

ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది...ఉగాది పచ్చడి.  తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఇలా షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి.   

facebook

ఉగాది పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం. ఇందులో చెరకు, అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం, మిరియాలు ఇలా మొదలైనవి వేస్తారు.  

facebook

ఉగాది పచ్చడి తయారీ అవసరమయ్యే పదార్థాలు - ఒక మామిడి కాయ,  అర కప్పు వేప పువ్వు,  అర కప్పు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, 100 గ్రాముల కొత్త చింతపండు,   100 గ్రా కొత్త బెల్లం, మిరియాల పొడి, ఒక అరటిపండు, అర కప్పు చెరకు రసం, సరిపడ ఉప్పు, నీళ్లు ,జామకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు.  

facebook

ఉగాది పచ్చడి తయారీ విధానం 

facebook

ముందుగా మామిడి కాయ, కొబ్బరి సన్నగా తరగాలి. మిరియాల పొడి, వేప పువ్వు రేకులను సిద్ధం చేసుకోవాలి. అలాగే చింతపండులో నీళ్లు పోసి నానబెట్టి గుజ్జు తయారు చేసుకోవాలి.  

facebook

చెరకు రసం సిద్ధం చేసుకోవాలి. బెల్లం సన్నగా తురుముకోవాలి. బెల్లాన్ని చింతపండు గుజ్జులో కలపాలి.  ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేయాలి.   

facebook

ఈ మిశ్రమానికి చివరిగా ఒక అర స్పూన్ ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధం అయినట్లే. వసంత లక్ష్మిని ఆహ్వానించేందుకు నైవేద్యం సమర్పించి బంధుమిత్రులతో ఉగాది పచ్చడి పంచుకోండి.  

facebook

తులసి ఆకులను తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను కూడా నియంత్రించగలదు.

Unsplash