ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పోషకాలకు పవర్‌హౌస్.

Unsplash

By Anand Sai
Apr 15, 2025

Hindustan Times
Telugu

ఉల్లిపాయలను ఉడికించకుండా పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Unsplash

ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు బీ, సి వంటి పోషకాలు ఉంటాయి.

Unsplash

ఉల్లిపాయలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

Unsplash

వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల హీట్ స్ట్రోక్‌ను నివారించవచ్చు. మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం ద్వారా పచ్చి ఉల్లిపాయలు వడదెబ్బ నుండి మిమ్మల్ని కాపాడతాయి.

Unsplash

ఉల్లిపాయలు సహజంగా చల్లదనాన్ని కలిగి ఉంటాయి. వేసవిలో వాటిని తినడం వల్ల సహజంగానే శరీరం చల్లబడుతుంది.

Unsplash

ఉల్లిపాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వేసవిలో కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Unsplash

ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Unsplash

నెట్‍ఫ్లిక్స్‌లో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు