మీ భాగస్వామికి మీమీద ఉన్నది నిజమైన ప్రేమని తెలిపే లక్షణాలివే..

pexels

By Koutik Pranaya Sree
Dec 07, 2023

Hindustan Times
Telugu

మీ భాగస్వామితో ఉన్నప్పుడు నిశ్చింతగా, భద్రంగా ఉన్నామనే భావన ఉంటుంది. భయం ఉండదు.

pexels

మీరు వాళ్లతో ఎలాంటి విషయాన్నైనా మాట్లాడగలుగుతారు. ఏదీ దాచకుండా నిజాయతీగా చర్చించగలుగుతారు.

pexels

మీ వ్యక్తిగత విషయంలో ఏ సమస్యలొచ్చినా మేమున్నామనే భరోసా ఇస్తారు. సమస్య తీర్చే ప్రయత్నం చేస్తారు. 

pexels

మీ ఇష్టాఅయిష్టాలకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్ని కూడా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. 

pexels

మిమ్మల్ని మీరున్నట్లుగానే అంగీకరిస్తారు. మీ లోపాల్ని కూడా అర్థం చేసుకొని ఇష్టపడతారు. 

pexels

మీరు చెప్పే విషయాన్ని వినకుండా వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లు ప్రవర్తించరు.  మిమ్మల్నీ ఏ విషయంలోనూ బలవంతం చేయరు.

pexels

మీరేపని చేసినా సపోర్టివ్‌గా ఉంటారు. అలాకాకుండా వారితో ఏం మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటే మీ బంధం గురించి ఆలోచించుకోవాల్సిందే..

pexels

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels