సమ్మర్ లో మామిడిపండ్లు తింటే వేడి చేస్తుందా..? ఈ విషయాలను తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 22, 2024
Hindustan Times Telugu
సమ్మర్ లో దొరికే మామిడిపండ్లను అందరూ ఇష్టపడుతుంటారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి.
image credit to unsplash
మామిడిపండ్లు ఎక్కువగా తీసుకుంటే వేడి చేయొచ్చు. ఈ పండ్లకు చలువ చేసే గుణం అయితే ఉండదు. కానీ దీనికి ఒక మార్గం ఉంది. తినే ముందు ఒక గంట సేపు నీళ్లల్లో నానబెడితే వేడి చేసే లక్షణం తగ్గుతుంది.
image credit to unsplash
మామిడిపండులో ఒక గ్రాము కొవ్వు కూడా ఉండదు. దీంట్లో ఉండే పీచు వల్ల పొట్టనిండిన సంతృప్తి వస్తుంది.
image credit to unsplash
మామిడి పండ్లలో విటమిన్ ఏ, సి,ఐరన్, పొటాషియం ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు.
image credit to unsplash
నిజానికి మామిడిపండ్లలో కెరాటిన్ ఎక్కువ. ఇది చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. దీంట్లో ఉన్న పీచు పేగును శుభ్ర పరుస్తుంది. హద్దుకు మించి తింటే తప్ప వీటివల్ల మొటిమల సమస్య రాదు.
image credit to unsplash
డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా మామిడిపండును తీసుకోవచ్చు. మితంగా తింటే పరవాలేదు. దీంట్లో మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చక్కెర స్థాయుల్ని తగ్గించడంలో సాయపడుతుంది.
image credit to unsplash
మామిడిపండ్లను ఎక్కువగా కాకుండా తక్కువ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
image credit to unsplash
డయాబెటిస్‍ను కంట్రోల్ చేయగల క్యాలరీలు తక్కువగా ఉండే డ్రింక్స్ ఇవి