చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఆయుర్వేద వైద్యుడు చెప్పిన సులభమైన హోం రెమెడీ ఇది..
By Sudarshan V May 23, 2025
Hindustan Times Telugu
చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు దారి తీస్తుంది. అనారోగ్య జీవన శైలి కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.
ఆయుర్వేద వైద్యుడు సలీం జైదీ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఒక సులభమైన వంటింటి చిట్కాను తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేశారు.
వంటగదిలోనే మనకు లభించే వెల్లుల్లి, అల్లం, నిమ్మ, తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్అనే 5 వస్తువులను ఉపయోగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు.
ముందుగా 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో 1 కప్పు నిమ్మరసం, 1 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్, 1 కప్పు తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నింపి ఫ్రిజ్ లో పెట్టాలి.
ప్రతీ రోజు ఉదయం పరిగడపున ఒక టేబుల్ స్పూన్ అంత ఈ మిశ్రమాన్ని తీసుకుని, గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి, అల్లం, నిమ్మ, తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే జింజెరోల్ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ రక్తాన్ని శుభ్రపరచడానికి, ధమనులను నిర్విషీకరణ చేయడానికి సహాయపడతాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్ కొవ్వును విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది రక్త నాళాల్లో అడ్డంకులను తొలగిస్తుంది.
తేనె కూడా సహజ యాంటీ ఆక్సిడెంట్. ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.
వాకింగ్ చేస్తున్నారా?..
నడిచేటప్పుడు ఈ తప్పులు చేయకండి..