నానబెట్టిన వేరుశెనగ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పెద్దలు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినాలని చెబుతారు.

Unsplash

By Anand Sai
Feb 09, 2025

Hindustan Times
Telugu

నానబెట్టిన వేరుశెనగ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

Unsplash

వేరుశెనగలను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి కడుపు శుభ్రపడుతుంది.

Unsplash

నానబెట్టిన వేరుశెనగల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా శరీరాన్ని శక్తివంతం చేస్తాయి.

Unsplash

వ్యాయామం చేసే లేదా శారీరక శ్రమ చేసే వారికి నానబెట్టిన వేరుశెనగ తినడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.

Unsplash

వేరుశెనగలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Unsplash

నానబెట్టిన వేరుశెనగలు డయాబెటిస్ రోగులకు మంచి ఆహారంగా పరిగణిస్తారు. ఎందుకంటే వాటిలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి.

Unsplash

నానబెట్టిన వేరుశెనగ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల బలహీనత నుండి ఉపశమనం లభిస్తుంది.

Unsplash

వేసవిలో ఈ 3 నూనెలు రాస్తే జుట్టు పొడవుగా పెరిగేస్తుంది

Photo: Unsplash