బీట్‌రూట్ రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అల్పాహారంతో పాటు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. 

Unsplash

By Anand Sai
Sep 27, 2023

Hindustan Times
Telugu

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహారంలో బీట్‌రూట్ రసాన్ని చేర్చుకోవచ్చు. బీట్‌రూట్ జ్యూస్‌లో అధిక మొత్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Unsplash

బీట్‌రూట్ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Unsplash

బీట్‌రూట్ జ్యూస్‌లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పొడి చర్మం కలిగి ఉంటే ఆహారంలో బీట్‌రూట్ రసాన్ని చేర్చుకోవచ్చు.

Unsplash

బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో సహజ రంగు ఉంటుంది. ఇది శరీరంలో మంటను కలిగించే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Unsplash

బీట్‌రూట్‌లో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Unsplash

పెద్దప్రేగు క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో బీట్‍రూట్ సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. 

Unsplash

జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ రసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. అల్పాహారంతోపాటుగా బీట్‍రూట్ జ్యూస్ తాగితే ఉపయోగాలు చాలా ఉంటాయి.

Unsplash

శరీరంలో ఐరన్‍ను పెంచే 5 రకాల జ్యూస్‍లు ఇవి

Photo: Pixabay