చిన్న పిల్లలు తరచూ నోటిలో చేతివేళ్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా బొటనవేలు చప్పరించడం పిల్లలలో ఒక సాధారణ అలవాటు. కొంత సమయం తర్వాత ఈ అలవాటును మాన్పించడానికి మీ పిల్లలకు సహాయం అవసరం.  

pexels

By Bandaru Satyaprasad
Jan 26, 2025

Hindustan Times
Telugu

పిల్లల్లో  సహజంగా కలిగే కొన్ని ప్రతిచర్యలు వారి బొటనవేళ్లు లేదా వేళ్లను నోటిలో పెట్టడానికి కారణమవుతాయి. కొంత మంది పిల్లలు వారికి ఓదార్పు అవసరమైనప్పుడు లేదా నిద్రపోయేటప్పుడు బొటనవేలు చప్పరించడం అలవాటు చేసుకుంటారు. 

freepik

చాలా మంది పిల్లలు 6 లేదా 7 నెలల వయస్సులో లేదా 2-4 సంవత్సరాల మధ్య వారి బొటనవేలును చప్పరించడం మానేస్తారు. 

pexels

పిల్లలకు శాశ్వత దంతాలు వచ్చే వరకు బొటనవేలు చప్పరించడం వల్ల అంతగా సమస్య ఉండదు. కానీ ఎంతసేపు చప్పరిస్తున్నారనే దానితో నోటి అంగిడి, దంతాలు వరుసపై ప్రభావం ఉంటుంది.   

pexels

కొంతమంది నిపుణులు 3 ఏళ్లలోపు చప్పరించే అలవాటును మాన్పించాలని సిఫార్సు చేస్తున్నారు. సాధారణంగా 5 ఏళ్లు నిండిన తర్వాత కూడా బొటనవేలు చప్పరింపు అలవాటు ఉంటే చికిత్స అవసరం అని అంటున్నారు.  

pexels

బొటనవేలు చప్పరించడం, నోటిలో వేళ్లు పెట్టుకునే అలవాటును మాన్పించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు పాటించండి.  

pexels

నోటిలో వేలు తీసేస్తే మీ బిడ్డను మెచ్చుకోవడం లేదా చిన్నపాటి గిఫ్టులు ఇవ్వండి. ముందు మీ పిల్లలు ఎంతసేపు బొటనవేలు చప్పరిస్తున్నారో గమనించి ఆ సమయాన్ని క్రమంగా తగ్గించడానికి ప్రయత్నించండి.  

pexels

ఏ సందర్భాల్లో పిల్లలు నోటిలో వేలు పెట్టుకుంటున్నారో ట్రిగ్గర్‌లను గుర్తించండి. ఆ సమస్యను గుర్తించి వారిని కౌగిలించుకోవడం లేదా భరోసా కల్పించాలి.  

pexels

మీ పిల్లలు బొటనవేలును చప్పరిస్తే...చిన్నారి దృష్టిని ఆకర్షించే మరో పనిచేయండి. అంతేకానీ పిల్లలను తిట్టవద్దు, విమర్శించవద్దు లేదా ఎగతాళి చేయవద్దు. 

pexels

కొంతమంది వైద్యులు మీ పిల్లలను ఈ అలవాటు మాన్పించడానికి వేలుకు చేదు పదార్థం రావడం, బొటన వేలికి కట్టు వేయడం లేదా రాత్రిపూట చేతిని గుడ్డతో కప్పడం వంటి సిఫార్సులు చేస్తారు. 

pexels

కొంతమంది పిల్లలకు బొటనవేలు చప్పరించడం మానేయడం చాలా కష్టమైన అలవాటు. ఈ అలవాటు మాన్పించడానికి మీ పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం కావచ్చు.  

pexels

ఒక్క లైన్​తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్​లు ఇవి..