చిన్నారుల్లో రక్తహీతన సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమస్యలకు బీట్ రూట్ చక్కటి పరిష్కారం. కానీ చిన్న పిల్లలు బీట్ రూట్ తినేందుకు ఇష్టపడరు. వాటిని బీట్ రూట్ తినిపించేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.  

pexels

By Bandaru Satyaprasad
Jun 30, 2024

Hindustan Times
Telugu

మీ ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో బీట్ రూట్ ను జోడించండి. మీ పిల్లల భోజనంలో బీట్ రూట్ ఎలా జోడించాలో తెలుసుకుందాం.   

pexels

బీట్ రూట్ పాన్ కేక్ - బీట్ రూట్ లను పాన్ కేక్ ల మిశ్రమంలో కలిపి, పాన్ కేక్ లను తయారు చేయండి. వీటిని ఈ పిల్లలు ఇష్టంగా తింటారు.  

twitter

బీట్ రూట్ బర్గర్ - హోల్ గ్రెయిన్ బ్రెడ్, బీట్ రూట్, ఆలూ టిక్కీ, ఫెటా చీజ్ తో అద్భుతమైన బర్గర్ తయారుచేయవచ్చు. ఈ బర్గర్ ను ఆకుకూరలతో లోడ్ చేయండి.  

twitter

బీట్ రూట్ చాక్లెట్ కేక్ - బీట్ రూట్, చాక్లెట్ తో రుచికరమైన కేక్ ను సిద్ధం చేయండి. వీటిని మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.  

twitter

బీట్ రూట్ చిప్స్ - బీట్ రూట్ ముక్కలను సన్నగా తరిగి, వేయించండి. ఈ ఆరోగ్యకరమైన బీట్ రూట్ స్నాక్ ట్రీట్ ను మీ పిల్లలతో కలిసి ఆస్వాదించండి.  

twitter

బీట్ రూట్ రోల్స్ - బంగాళాదుంపలను ఉడకబెట్టి మొత్తగా చేసి, దానికి మసాలా దినుసులు జోడించండి. దీంతో రోల్స్ తయారుచేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.  

twitter

బీట్ రూట్ వడలు -బీట్ రూట్, క్యారెట్, ఉల్లిపాయలు, ఆలూ బాగా తురిమి ఈ మిశ్రమానికి తగిన ఉప్పు, దినుసులు, పిండి జోడించండి. దీంతో వడలు వేస్తే ఈ పిల్లలు ఇష్టంగా తింటారు.  

twitter

వ్యాయామానికి ముందు శక్తి పెరిగేందుకు 5 రకాల ఆహారాలు

Photo: Pexels