బ్లూబెర్రీల్లో ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్లూబెర్రీలతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే..
Photo: Pexels
బ్లూబెర్రీల్లో పొటాషియం, ఫోలెట్, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుండె వ్యాధుల రిస్క్ తగ్గిస్తాయి
Photo: Pexels
బ్లూబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీంతో ఇవి రెగ్యులర్‌గా తింటే రోగ నిరోధక శక్తిని మెరుగుపరచగలవు.
Photo: Pexels
బ్లూబెర్రీల్లో యాంటీఇన్‍ఫ్లమేషన్, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. దీంతో మెదడు పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి.
Photo: Pexels
జెంక్సాంథిన్, లుటెయిన్‍లను బ్రూబెర్రీలు కలిగి ఉంటాయి. దీంతో ఇవి తింటే కంటి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
Photo: Pexels
బ్లూబెర్రీల్లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తినొచ్చు. వెయిట్ లాస్‍కు ఈ పండు సహకరిస్తుంది.