న్యూ ఇయర్ లో మీ ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే ప్రకృతికి మించిన బెస్ట్ ప్లేస్ మరొకటి లేదు. సుందరమైన ప్రకృతి ఒడిలో అలా కొన్ని రోజులు గడపాలనుకుంటున్నారా? కేరళలోని కవ్వాయి బ్యాక్ వాటర్స్, ఐలాండ్స్ అద్భుతమైన ప్రదేశం.
pexels
By Bandaru Satyaprasad Dec 31, 2024
Hindustan Times Telugu
నార్త్ కేరళలో అతిపెద్ద బ్యాక్ వాటర్ ద్వీప సమూహం కవ్వాయి. ఒక్కసారి కవ్వాయి చూస్తే ఎప్పటికీ ఇక్కడే ఉండాలనే కోరిక మీలో కలుగుతుంది. కవ్వాయి బ్యాక్ వాటర్స్ కేరళలో మూడో అతి పెద్ద బ్యాక్ వాటర్ , నార్త్ కేరళలో అతి పెద్దది.
pexels
ఇక్కడ అత్యంత అద్భుతమైన ప్రదేశం మడ అడవుల నర్సరీ, బోట్ లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి స్వచ్ఛమైన ప్రకృతిలో మనలోని ఒత్తిళ్లన్నీ ఇట్టే మర్చిపోవచ్చు.
pexels
బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ (కాయకింగ్) ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేము. మీలోని ఓ కొత్త మనిషిని ఇక్కడి ప్రకృతి మీకు పరిచయం చేస్తుంది.
pexels
కవ్వాయిలోని చిన్న చిన్న ఐలాండ్స్ లో బోట్ రైడ్ మధ్యలో రీలాక్స్ అవ్వొచ్చు. ఇక్కడి గ్రీనరీ మనల్ని మెస్మరైజింగ్ చేస్తుంది.
pexels
కవ్వాయి ఐలాండ్స్ 37 చదరపు కి.మీ విస్తీర్ణంలో కవ్వాయి బ్యాక్ వాటర్స్ లో విస్తరించి ఉన్నాయి.
pexels
టూరిస్టులు స్పీడ్ బోట్, కాయకింగ్, ఐలాండ్ క్యాపింగ్, హౌస్ బోట్ రైడ్ ఎంజాయ్ చేయవచ్చు.
pexels
కవ్వాయి ఐలాండ్స్ కేరళలోని కన్నూర్, కాసరగోడ్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కవ్వాయిలో అతిపెద్ద ద్వీపం వలియపరంబ, దాని సమీపంలోని బ్యాక్ వాటర్ చూస్తే మీరు తప్పకుండా ప్రకృతి ప్రేమలో పడిపోతారు.
pexels
కవ్వాయి బ్యాక్ వాటర్స్ లో వాటర్ జోర్బింగ్, పెయిడ్ బోట్ రైడ్‌లు, రౌండ్ ట్రిప్ బోటింగ్, విలేజ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్, వాటర్ స్పోర్ట్స్ ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.
pexels
ఎలా చేరుకోవాలి : మంగుళూరు-పాలక్కాడ్ లైన్‌లో పయ్యనూర్ సమీప రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. కన్నూర్, మంగుళూరు, కాలికట్‌లలో విమానాశ్రయాలు ఉన్నాయి.
pexels
గుండె జబ్బుల్లో మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు గుర్తించడం ఎలా...