ఎరుపు చీరలో కీర్తి క్యూట్ అందాలు: ఫొటోలు, ఈ బ్యూటీ లైనప్‍లో రెండు సినిమాలు, ఓ సిరీస్
Photo: Instagram
By Chatakonda Krishna Prakash May 18, 2025
Hindustan Times Telugu
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మరోసారి చీరలో మెరిసిపోయారు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో మైమరిపించారు. ట్రెడిషనల్ లుక్‍లో మరింత అందంగా కనిపించారు.
Photo: Instagram
ఎరుపు రంగు చీరలో కీర్తి తళుక్కుమన్నారు. ఫ్లోరల్ డిజైన్ ఉన్న ఈ శారీలో హొయలు ఒలికించారు ఈ బ్యూటీ. తన మార్క్ ఎలిగెన్స్‌తో వారెవా అనిపించారు.
Photo: Instagram
సూర్య కిరణాలు తాకుతుంటే అలా ముఖానికి అర చేతిని స్టైలిష్‍గా అడ్డుపెట్టుకున్నారు కీర్తి. ఈ సింపుల్ శారీ లుక్‍లో బ్యూటిఫుల్‍గా షైన్ అయ్యారు.
Photo: Instagram
ఈ ఫొటోలను నేడు (మే 18) తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు కీర్తి సురేశ్. దుబాయ్ డైరీస్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. రెడ్, వైట్ లవ్ ఎమోజీలను ఉంచారు.
Photo: Instagram
దుబాయ్‍లో వ్యాపారవేత్తగా స్థిరపడిన తన ప్రేమికుడు ఆంటోనీ తత్తిల్‍ను గతేడాది వివాహం చేసుకున్నారు కీర్తి సురేశ్. 2024 డిసెంబర్ 12న గోవాలో గ్రాండ్‍గా వీరి వివాహం జరిగింది. ఆంటోనీ సొంత ఊరు కేరళలోని కొచ్చి.
Photo: Instagram
కీర్తి సురేశ్ ప్రస్తుతం తమిళంలో రివాల్వర్ రీటా, కన్నివీడి సినిమాలు చేస్తున్నారు. ఇంటెన్స్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అక్క’లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ బ్యూటీ.
Photo: Instagram
ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికిన ఒకే ఒక్కడు- ఎవరు ఈ విశ్వాస్?