హిమాలయాల్లో హోటల్ పెట్టిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్

By Sanjiv Kumar
Feb 06, 2025

Hindustan Times
Telugu

హిమాలయాలలోని మనాలిలో 'ది మౌంటైన్ స్టోరీ' అనే రెస్టారెంట్‌ పెట్టింది కంగనా రనౌత్.

ఫిబ్రవరి 14వ తేదీన ఈ హోటల్ ప్రారంభం కానుందని కంగనా రనౌత్ తెలిపింది.

న కొత్త రెస్టారెంట్ గురించి ఫోటోలను సోషల్ మీడియాలో తాజాగా పంచుకుంది కంగనా రనౌత్.

తన చేతులతోనే ఖాతాదారులకు ఆహారం అందించే వీడియోను కూడా షేర్ చేసింది కంగనా రనౌత్.

ఈ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా తన  చిన్ననాటి కల నెరవేరుతోంది అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ కాంట్రవర్సియల్ కంగనా రనౌత్.

దీంతో కంగనా రనౌత్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తమిళంలో తాంధూమ్, తలైవి, చంద్రముఖి 2 వంటి చిత్రాలలో నటించిన కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఇటీవల ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా. అయితే, ఈ సినిమాతో తొలిసారిగా దర్శకత్వం వహించింది కంగనా రనౌత్.

వేసవిలో చెమట వాసన సమస్యా...? ఇలా వదిలించుకోండి

image credit to unsplash