సాధారణంగా మేనేజీరియల్ పొజిషన్స్ కు ఎంబీఏ డిగ్రీ ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఎంబీఏ పూర్తి చేసిన వారికి పలు రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అందులో కొన్ని బెస్ట్ కెరీర్ మార్గాలను వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయం సూచిస్తోంది.
Photo Credit: Pixabay
ఫైనాన్షియల్ మేనేజర్: ఫైనాన్షియల్ మేనేజర్ కంపెనీ బడ్జెట్ ను, ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. సంస్థ ఆర్థిక విషయాలను ప్లాన్ చేస్తారు. సగటు వేతనం 1,31,210 డాలర్లు.
Photo Credit: Pixabay
మార్కెటింగ్ మేనేజర్: సంస్థ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు, కార్యక్రమాలను మార్కెటింగ్ మేనేజర్ సమన్వయం చేస్తాడు. మార్కెటింగ్ మేనేజర్ సగటు వేతనం 1,35,030 డాలర్లు.
Photo Credit: Pixabay
బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్: వ్యాపారం ఎలా పనిచేస్తుందో, ఎలా మెరుగుపడుతుందో, ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవచ్చో విశ్లేషించే విధులు నిర్వర్తిస్తారు. మార్కెట్ ధోరణులను పరిశీలిస్తుంటారు. సగటు వేతనం 1,00,910 డాలర్లు.
Photo Credit: Pixabay
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: సీఈఓలు కంపెనీ యాజమాన్యం, కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాపార వృద్ధికి కృషి చేస్తారు. సీఈఓ సగటు వేతనం 1,79,520 డాలర్లు.
Photo Credit: Pixabay
హెచ్ఆర్ మేనేజర్: మీకు హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, మీరు ఈ పాత్రను ఎంచుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజర్లు ఉద్యోగుల రిక్రూట్మెంట్, రిటెన్షన్ సహా సంస్థ మానవ వనరుల కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. వీరి సగటు వేతనం 126,230 డాలర్లు.
Photo Credit: Pixabay
ప్రాజెక్ట్ మేనేజర్: వివిధ కంపెనీ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రాజెక్ట్ మేనేజర్ అవసరం. ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ యొక్క షెడ్యూల్, టైమ్ లైన్, ప్రొక్యూర్ మెంట్, స్టాఫింగ్, బడ్జెట్ ని విశ్లేషించడం, సమన్వయం చేయడం వీరి డ్యూటీ. వీరి సగటు వేతనం 94,500 డాలర్లు.
Photo Credit: Pixabay
సేల్స్ మేనేజర్: సేల్స్ పెంచే మార్గాలను అన్వేషిస్తారు. సేల్స్ టీమ్ ను లీడ్ చేస్తారు. సేల్స్ పర్సన్ లకు శిక్షణ ఇస్తారు. సేల్స్ టార్గెట్లను నిర్దేశిస్తారు. సేల్స్ మేనేజర్ల సగటు వేతనం 1,27,490 డాలర్లు.
Photo Credit: Pixabay
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?