పుచ్చకాయను వేసవిలో అధికంగా తింటారు. అయితే పుచ్చకాయ కొనే ముందుకు అది సహజంగా పండిందో లేదో తెలుసుకోవాలి.
Pixabay
వేసవిలో పుచ్చకాయ తినడం చాలా మంచిది. కానీ పుచ్చకాయను ఎర్రగా పండేలా చేయడానికి రసాయన ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. అలాంటివి కొనకూడదు.
Pixabay
పుచ్చకాయ సహజంగా పండితేనే రుచిగా ఉంటుంది.
Pixabay
పుచ్చకాయ కొన్ని చోట్ల మెత్తగా, మరికొన్ని చోట్ల గట్టిగా అనిపిస్తే అందులోకి రసాయనాలు ఇంజెక్ట్ అయ్యాయని అర్థం. అలాంటి పండు కొనకూడదు. పుచ్చకాయ గట్టిగా ఉంటే లోపల బాగా పండిందని తెలుసుకోవాలి
Pixabay
పుచ్చకాయ సహజంగా పండితే దాని తొడిమ ప్రాంతం ఎండిపోయినట్టు ఉంటుంది. ఆ పండు ఎర్రగా, తీయగా ఉంటుందని అర్ధం చేసుకోవాలి.
Pixabay
పుచ్చకాయ చిన్నదైనా పెద్దదైనా ఒక చేత్తో ఎత్తినప్పుడు అది బరువుగా అనిపించాలి. అది బరువుగా ఉంటే తాజాగా ఉన్నట్టు లెక్క.
Pexels
పుచ్చకాయ కొనేముందు ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడండి. దాని నుంచి తీయటి వాసన వస్తే కొనవచ్చు.
Pexels
పుచ్చకాయపై గీతలు ముదురు గోధుమ రంగులో ఉంటే అది పండిందని అర్థం చేసుకోవచ్చు.
Pexels
మార్కెట్లో సహజంగా పండిన పుచ్చకాయలతో పాటూ రసాయనాలు ఇంజెక్ట్ చేసి పండిస్తున్న పండ్లు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
Pexels
కల్తీ పుచ్చకాయను తింటే ఎన్నో ఆరోగ్యమస్యలు వచ్చేస్తాయి.
ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు
అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే