టీ తాగితే శరీరానికి మేలు కలుగుతుందా, హాని జరుగుతుందా... టీ తాగడంపై భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి...

By Bolleddu Sarath Chandra
Feb 04, 2025

Hindustan Times
Telugu

టీ అతిగా తాగితే  నరాలు, లివర్‌, పాంక్రియాస్‌ దెబ్బతింటాయని, జీర్ణ శక్తి నశిస్తుందనే వాదనలు ఉన్నాయి.

టీ తాగితే  ఎలాంటి అపకారం  జరగదని, టీతో నూతనోత్సాహం, శరీరానికి ఉత్తేజం లభిస్తుందని ఎక్కువ మంది భావిస్తారు. 

టీ తాగే అలవాటు చైనా నుంచి  ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. 

టీ తాగే అలవాటు  చైనా నుంచి అరబ్బులకు చేరుకుంది. క్రమేణా ఆంగ్లేయులు, పోర్చుగీసు  వారికి అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా  యూరోప్‌కు విస్తరించింది. 

చవకగా లభించే పానీయం కావడంతో నిత్యం పెద్ద ఎత్తున టీని ఆహారంగా వినియోగించడం పెరిగింది. 

టీలో మనసుకు ఉత్తేజాన్ని, శరీరానికి ఉల్లాసాన్ని ఇచ్చే గుణం ఉండటంతో పగలు అలసిపోయిన వారికి ఉత్సాహం లబించేది.

టీలో లభించే రసాయిన పదార్ధాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. టీ ఆకుల్ని బట్టి, టీ తయారు చేసే విధానాన్ని బట్టి టీ రుచి మారిపోతుంది. 

టీలో సాధారణ నీరు 5 నుంచి 8శాతం ఉంుటంది. కెఫిన్‌ 2 నుంచి 5శాతం, నైట్రోజన్‌ 4.75శాతం నుంచి 5.5 శాతం ఉండేది. వీటన్నింటిలో టీకి రంగు, రుచి వాసన అందించే కెఫిన్‌, టానిన్‌ పరిమళ నూనెలు ఉంటాయి. నల్ల టీ ఆకుల్లో కంటే గ్రీన్‌ టీలో టానిన్ ఎక్కువగా ఉంటుంది. 

టీలో ఏ పదార్ధాలు ఉన్నా శరీరం మీద దాని ప్రభావం టీ ఆకుల రకం , తయారీ విధానం ఆధారంగా  ఉంటుంది. 

టీలో ఉండే టానిన్‌ నోట్లో ఊరే లాలాజలం ఉత్పత్తిని  నియంత్రిస్తుంది. చైనా టీలో కంటే అస్సాం టీలో టానిన్‌ ఎక్కువగా ఉంటుంది.  అస్సాం టీ తాగినప్పుడు లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. 

టీలో మాంగనీస్‌, పొటాషియం వంటి ఖనిజ లవణాలు  లభిస్తాయి.  టీలో ఉండే టానిన్‌ శరీరంలో విటమిన్ సి నిల్వ ఉండేలా చేస్తుంది. 

వేడి వేడి టీ తాగడం వల్ల ముక్కు పుటల్లో మ్యూకస్‌ రెట్టింపు చేసి సూక్ష్మ క్రిములు నశించేలా చేస్తుంది. .

దంత క్షయానికి దారి తీసే బాక్టీరియాను నిరోధించడానికి టీ ఉపయోగపడుతుంది. 

టీలో ఉండే ఫ్లోరైడ్ దంతక్షయాన్ని నిరోధిస్తుంది.  ఆస్ట్రియో పోరోసిస్‌ అనే కీళ్ల వ్యాధి రాకుండా సహకరిస్తుంది. 

టీలో ఉండే కెఫిన్‌  మెదడులో ఉండే నెర్వ్‌ ఇంపల్స్‌ను రిలే చేసే రసాయినాల్ని  అధికంగా విడుదలయ్యేలా చేస్తుంది. 

మీరు ఎంచుకున్న రంగంలో విజేతగా నిలవాలంటే ఈ అలవాట్లు ఉండితీరాలి..