అద్దె కారు - సొంతకారు.. రెండింటిలో ఏది బెటర్ అనేది తేల్చుకోలేక పోతున్నారా?

By Bolleddu Sarath Chandra
Oct 11, 2024

Hindustan Times
Telugu

కారు కొనాలని ఉన్నా దాని వినియోగం, అవసరం ఏ మేరకు ఉందనే విషయంలో స్ఫష్టత తెచ్చుకున్న తర్వాతే కారును కొనడం ఉత్తమం

అద్దె కారు - సొంతకారు.. రెండింటిలో దేని సానుకూలతలు, ప్రతికూలతలు దానికి ఉన్నాయి. ఆర్థికంగా కలిసి రావాలంటే సొంత కారు కంటే అద్దె కారులను ఎంచుకోవడం ఉత్తమం..

జీవితానికి కావాల్సిన ఆర్థిక అవసరాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లోనే ఉంటే సొంత కారు ఉండాలో, అద్దె కారుతో సరిపెట్టుకోావాలో నిర్ణయించుకోవాలి.

బేసిక్ మోడల్ కారును అన్ని పన్నులతో బ్యాంకు రుణంపై  రూ.7లక్షల ధరకు కొనుగోలు చేసినా ఏడేళ్ల తర్వాత దానికి రూ.2-3లక్షల రీసేల్ వాల్యూ కూడా ఉండదు.

సొంత కారులో రోజుకు 30కిలోమీటర్లు ప్రయాణించడం కంటే అద్దె కారులో తిరిగిన దానికి మాత్రమే చెల్లించడం ద్వారా  సొంత కారులో రోజుకు అయ్యే ఖర్చులో సగానికంటే తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. 

వ్యక్తిగత ప్రయాణాల్లో సొంత కారుతో పోలిస్తే అద్దె కారులతో నిర్వహణ ఖర్చులు, పార్కింగ్ సమస్యలు ఉండవు. సొంత కారుపై చేసే పెట్టుబడి వ్యయాన్ని మరో చోట ఇన్వెస్ట్ చేస్తే  ఏడేళ్ల తర్వాత   రెట్టింపు లాభాలు పొందొచ్చు.

సొంత కారులో ఉండే సౌలభ్యాలు చాలా ఉన్నా ఆర్థిక ప్రాధాన్యతలు ఎంచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. చేసే ఖర్చులో ఏ మేరకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందో కూడా లెక్క వేసుకోవాలి. 

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ రక్షా గౌడ‌కు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. 

Instagram