అధిక రక్తపోటు సమస్యను ఆహారం, జీవన విధానంలో మార్పులతో కూడా అదుపు చేసుకోవచ్చు.
By Bolleddu Sarath Chandra Nov 19, 2024
Hindustan Times Telugu
కొవ్వు పదార్ధాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను భుజించడం వల్ల రక్తనాళాలు గడ్డకడతాయి. అవి రక్తనాళాలను బిగుతుగా చేసి రక్త ప్రసారాన్ని అడ్డుకుంటాయి. దీని వల్ల రక్తపోటు అధికం అవుతుంది.
Pexel
ఆహారంలో కొవ్వు కొలెస్ట్రాల్ ఉన్న ఆహారపదార్ధాలను నియంత్రించడం ద్వారా రక్తాన్ని గడ్డకట్టకుండా నిరోధించవచ్చు
రక్తపోటును తగ్గించడానికి మందులకంటే ఆహారంతో అదుపులోకి తీసుకురావడమే మెరుగైన మార్గం
ఆహారం, సరైన జీవన శైలిని సక్రమంగా పాటిస్తే ఎలాంటి మందులు, వైద్యులతో పని లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు
డయాటరీ అప్రోచ్ టూ స్టాప్ హైపర్ టెన్షన్ విధానాన్ని బీపీ నియంత్రణలో భాగంగా చేసుకోవచ్చు. ఆహారంలో ఫైబర్, పొటాషియం, మెగ్నిషియం, కాల్ఫియం మెండుగా ఉండేలా పళ్లు, కూరగాయలు, ఆకు కూరల్ని ఎక్కువగా తీసుకోవాలి.
గుండె ధమనులకు రక్త ప్రసరణ సజావుగా సాగితే రక్తపోటుకు ఆస్కారం ఉండదు. ఈ రకమైన ఆహారాలకు పరిమితమైతే రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.
ఫైబర్‌తో కూడిన ఆహారం రక్తపోటును నిరోధిస్తుంది. తాజా కూరగాయలు, పాలిష్ చేయని ధాన్యాలు, ఓట్స్, నట్స్, సీడ్స్, బీన్స్ వంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
రక్తపోటు అధికంగా ఉండేవారిలో సోడియం అధికంగా ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉంటుంది. పొటాషియం శాతం పెంచడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఇందుకు యాపిల్స్, అరటి పండ్లు, టమాటా, క్యాబేజీలను ఆహారంలో నిత్యం తీసుకోవాలి.
యాపిల్స్‌లో ఉండే పెక్సిన్ అనే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులతో పాటు రక్తపోటును నివారిస్తుంది.
ప్రతిరోజు తగినంత నీటిని తాగడం, మాంసాహారం, రిఫైండ్ ఆయిల్స్, కాపీ, కోలా డ్రింక్స్, ఉప్పు, చక్కెర తగ్గించడం ద్వారా బీపీ అదుపులో ఉంచుకోవచ్చు.
ఉల్లిపాయలు, వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తాయి
శరీరంలో కొలెస్ట్రాల్‍ను సహజంగా తగ్గించగల పండ్లు ఇవి