హైదరాబాద్ టు వయనాడ్ ట్రిప్ - ఈ టూర్ ప్యాకేజీ చూడండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Apr 24, 2025
Hindustan Times Telugu
ఈ వేసవి వేళ కేరళలోని వయనాడ్ అందాలను వీక్షించాలనుకునే వారికోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.
image credit to unsplash
వయనాడ్ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంది. ప్రస్తుతం 29 ఏప్రిల్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
image credit to unsplash
మొత్తం 6 రోజులు ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్తారు. 'WONDERS OF WAYANAD (SHR098)' పేరుతో ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ప్యాకేజీ ఉంటుంది. బుకింగ్ చేసుకోవచ్చు.
image credit to unsplash
మొదటిరోజు ఉదయం 6.05 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి జర్నీ ఉంటుంది. ఇందులో భాగంగా సెయింట్ ఏంజెలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం, కుర్వాదీప్, తిరునెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్‌ను సందర్శిస్తారు.
image credit to unsplash
అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సును కూడా విజిట్ చేస్తారు. కప్పడ్ బీచ్‌ను సందర్శిస్తారు. 6వ రోజు రాత్రి 11. 40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
image credit to unsplash
హైదరాబాద్ - వయనాడ్ ట్రిప్ ధరలు : సింగిల్ షేరింగ్ రూ.37,640, డబుల్ షేరింగ్ రూ.21,220గా ఉంది. ట్రిపుల్ షేరింగ్ రూ.17740గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫర్ట్(3AC) క్లాస్ లో ఉంటాయి.
image credit to unsplash
స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 34840, ట్రిపుల్ షేరింగ్ రూ.14950గా నిర్ణయంచారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు వేర్వురు ధరలున్నాయి. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
image credit to unsplash
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.