అందాల కేరళను చుట్టేస్తారా..? ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Apr 13, 2025
Hindustan Times Telugu
హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీని IRCTC టూరిజం ఆపరేట్ చేస్తోంది.
image credit to unsplash
ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు కేరళలోని పచ్చని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
image credit to unsplash
IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే KERALA HILLS & WATERS పేరుతో ప్యాకేజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఏప్రిల్ 22వ తేదీన అందుబాటులో ఉంది.
image credit to unsplash
5 రాత్రులు, 6 రోజులు టూర్ ప్యాకేజీ ఇది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ప్రారంభమవుతుది.
image credit to unsplash
హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 35,180గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 20,260 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17450 గా నిర్ణయించారు. కంఫర్ట్ 3ఏ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి.
image credit to unsplash
స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.14720, డబుల్ షేరింగ్ కు రూ. 17530గా ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 32450గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.
image credit to unsplash
ఈ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు. ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ కూడా చేసుకోవచ్చు.