రేటు లో టాప్‌.. మ‌రి ఆట‌లో? అత్య‌ధిక ధ‌ర ప‌లికిన క్రికెట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న ఇలా

PTI

By Chandu Shanigarapu
Apr 26, 2025

Hindustan Times
Telugu

ఐపీఎల్ మెగా వేలంలో రూ.27 కోట్ల‌తో పంత్ రికార్డు క్రియేట్ చేశాడు. కానీ 8 ఇన్నింగ్స్‌ల్లో 106 ప‌రుగుల‌తో తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నాడు ఈ ల‌క్నో కెప్టెన్‌.

reuters

శ్రేయ‌స్ అయ్య‌ర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు పెట్టింది. ఆ రేటుకు న్యాయం చేస్తూ శ్రేయ‌స్ 8 ఇన్నింగ్స్‌ల్లో 263 ప‌రుగులు చేశాడు.

AFP

రూ.23.75 కోట్ల‌తో కేకేఆర్ సొంతం చేసుకున్న వెంక‌టేశ్ అయ్య‌ర్ బ్యాటింగ్‌లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 135 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.

reuters

పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ 8 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు తీశాడు. అత‌ణ్ని రూ.18 కోట్ల‌కు కొనుక్కుంది పంజాబ్‌.

reuters

స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ కోసం కూడా పంజాబ్ రూ.18 కోట్లు పెట్టింది. అత‌ను 8 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లే ప‌డ‌గొట్టాడు.

AP

రూ.15.75 కోట్ల‌తో గుజ‌రాత్ కొనుక్కున్న బ‌ట్ల‌ర్ మాత్రం ఇర‌గ‌దీస్తున్నాడు. అత‌ను 8 ఇన్నింగ్స్‌ల్లో 356 ర‌న్స్ చేశాడు.

AFP

కేఎల్ రాహుల్‌ను రూ.14 కోట్ల‌కు ద‌క్కించుకుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్. అత‌ను 7 ఇన్నింగ్స్‌ల్లో 323 పరుగులు సాధించాడు.

AFP

పీరియడ్స్ ఆలస్యం కాకూడదలంటే ఈ ఆహారాలకు దూరం ఉండండి!