నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. ఫ్రెండ్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్ స్నేహాలు ఎప్పటికీ విడిపోని బంధాలుగా ఉంటాయి. బాల్య స్నేహాలు చాలా విలువైనవి, ఆ స్నేహాలు కొనసాగించడం చాలా ముఖ్యం.  

pixabay

By Bandaru Satyaprasad
Aug 04, 2024

Hindustan Times
Telugu

బాల్య స్నేహాలను కొనసాగించడం వల్ల అనేక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.   

pixabay

బాల్య స్నేహితులు ఎమోషనల్ యాంకర్స్- చిన్ననాటి స్నేహితులు మన భావోద్వేగాలను సులభంగా అర్థం చేసుకుంటారు. వారితో దీర్ఘకాలిక స్నేహం కొనసాగిస్తే ఒత్తిడి లేదా అనిశ్చితి సమయంలో మనకు సహాయపడతారు.   

pexels

దీర్ఘకాల స్నేహాలు- సుదీర్ఘకాల స్నేహాలు ఒకరి వ్యక్తిత్వం గురించి పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. వారి దృక్పథం, ఆలోచనలపై అవగాహన ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహాలు సుదీర్ఘకాలం కొనసాగిస్తే... మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. 

pixabay

ఒత్తిడి తగ్గింపు - బాల్య స్నేహాలు, స్నేహితులతో గడిపిన క్షణాలు ఒత్తిడిని తగ్గించగలవు. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకున్న వారితో మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ సమస్యల గురించి వారితో చర్చించి, మీపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.  

pixabay

భావోద్వేగ మద్దతు - దీర్ఘకాలిక స్నేహాలు భావోద్వేగ మద్దతును అందిస్తాయి. మీ జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మద్దతు ఇచ్చే మిత్రులు ఉన్నారంటే మీలో విశ్వాసం పెరుగుతుంది. ఈ పరిస్థితులు మీ ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడతాయి.   

pixabay

నోస్టాల్జియా- చిన్ననాటి స్నేహితులతో తరచూ మాట్లాడుతుంటే గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటే..  ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  

pixabay

నైపుణ్యాలు బలోపేతం - దీర్ఘకాలిక స్నేహాలు సామాజిక నైపుణ్య అభివృద్ధిని తోడ్పడతాయి. ఈ బంధాలు వ్యక్తుల మధ్య నైపుణ్యాలను పెంపొందించడానికి, బలోపేతం చేయడానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.   

pixabay

తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు- బీట్​రూట్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

pexels