ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కోసం 5 పానీయాలు

Image Credits: Adobe Stock

By Sudarshan V
May 09, 2025

Hindustan Times
Telugu

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం. కానీ ఫాస్టింగ్ విండోలో హైడ్రేటెడ్ గా, శక్తివంతంగా ఉంచే, బరువు తగ్గడానికి తోడ్పడే 5 ఆరోగ్యకరమైన పానీయాలు ఇక్కడ ఉన్నాయి.

Image Credits: Adobe Stock

నిమ్మ రసం

Image Credits: Adobe Stock

సాదా నీరు గొప్పది, కానీ దానికి నిమ్మకాయ ముక్కను జోడించడం రిఫ్రెషింగ్ ట్విస్ట్ ఇస్తుంది. నిమ్మకాయ నీటిలో దాదాపు జీరో కేలరీలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.

Image Credits : Adobe Stock

బ్లాక్ కాఫీ

Image Credits: Adobe Stock

బ్లాక్ కాఫీలో కూడా దాదాపు జీరో కేలరీలే. ఇది రిఫ్రెషింగ్ ఫీల్ తో పాటు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. దీనికి క్రీమ్, చక్కెర మాత్రం జోడించవద్దు.

Image Credits: Adobe Stock

గ్రీన్ టీ

Image Credits: Adobe Stock

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది ఫ్యాట్ బర్నింగ్ కు సహాయపడుతుంది.  స్వీటెనర్లు యాడ్ చేయకండి.

Image Credits: Adobe Stock

హెర్బల్ టీ

Image Credits: Adobe Stock

పిప్పరమింట్, చమోమిలే లేదా అల్లం వంటి హెర్బల్ టీలు కెఫిన్ లేనివి. మీ కడుపుకు ఉపశమనం కలిగిస్తాయి. ఉపవాసం సమయంలో, ముఖ్యంగా సాయంత్రం విశ్రాంతి తీసుకోవడానికి ఇవి గొప్ప మార్గం.

Image Credits: Adobe Stock

స్పార్క్లింగ్ వాటర్

Image Credits: Adobe Stock

ఏదైనా ఫిజ్జీగా కావాలనుకుంటే స్పార్క్లింగ్ వాటర్ ను ఆస్వాదించండి. ఇందులో  కేలరీలు ఉండవు. ఇది ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Image Credits: Adobe Stock

ఎముకల బలానికి ప్రొటీన్‌ కావాల్సిందే..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash