పాత చీరలను పడేసే బదులు ఇలా తిరిగి వినియోగించుకోండి

By Haritha Chappa
Jan 30, 2025

Hindustan Times
Telugu

మహిళలు అనేక చీరలు తీసుకుంటారు. అవి పాతగా అయ్యాక ఏం చేయాలో తెలియక అలా వదిలేస్తారు. వారి వేస్టుగా వదిలేసే బదులు వాటిని తిరిగి వినియోగించుకోవచ్చు.

చాలా చీరలు  బరువుగా ఉంటాయి, ఇవి ధరించడానికి మంచిగా అనిపించవు. మీ ఇంట్లో కూడా అలాంటి చీరలు ఉంటే వాటిని పనికిరానివిగా భావించకండి.

చాలా మంది మహిళలు పాత చీరలతో డోర్ మ్యాట్లను తయారు చేయడానికి ఇష్టపడతారు. చాపలు కుటించేందుకు కూడా ఉపయోగిస్తారు. 

చీర కట్టుకోవడం ఇష్టం లేకపోతే దానితో స్కార్ఫ్ లేదా దుపట్టాను కూడా తయారు చేసుకోవచ్చు. వాటి అందాన్ని పెంచుకోవడానికి లేసులను వాడండి.

ఇంట్లో ఉంచిన పాత చీరలతో కుషన్ కవర్లు తయారు చేయండి. కుషన్లకు ట్రెండీ లుక్ ఇవ్వడానికి వాటిపై లేసులు, టాసెల్స్ ఉపయోగించండి.

పాత పట్టుచీరలతో పోట్లీ బ్యాగులు తయారు చేసుకోవచ్చు.

పాత చీరలతో సల్వార్ సూట్లు కుట్టుకోవచ్చు.

ఆరు మీటర్ల పొడవున్న చీరలతో అందమైన కర్టెన్లను తయారు చేయగలదు. విభిన్న చీరలను మిక్స్ చేసి మ్యాచింగ్ చేయడం ద్వారా డిజైనర్ లుక్ ఇవ్వవచ్చు. 

విజువల్ స్టోరీస్ చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.

Image Credit Unsplash