మీకు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ అంటే ఇష్టమా? రోజుకు ఒకసారైనా తింటున్నారా? అయితే ఇన్‌స్టంట్ నూడుల్స్ వల్ల కలిగే 6 దుష్ప్రభావాలను తెలుసుకోండి.   

pexels

By Bandaru Satyaprasad
Jun 03, 2024

Hindustan Times
Telugu

ఇన్ స్టంట్ నూడుల్స్ తయారీలో సోడియం, ప్రిజర్వేటివ్‌లు, ఇతర రసాయనాలు ఉపయోగిస్తారు. ఇవి మీకు అనారోగ్యం కలిగిస్తాయి.  అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.   

pexels

పోషకాలు తక్కువ- ఇన్‌స్టంట్ నూడుల్స్ లో పోషక పదార్థాలు ఉండవు. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండవు. వీటికి బదులుగా అధిక సంఖ్యలో కేలరీలను అందిస్తారు. మీ బరువు నిర్వహణకు సమస్యగా మారుతుంది.   

pexels

మోనోసోడియం గ్లుటామేట్ (MSG)- నూడుల్స్ రుచి కోసం మోనోసోడియం గ్లుటామేట్ అనే రసాయనం కలుపుతారు. దీని వల్ల దుష్ప్రభావాలు లేకపోలేదు. అధిక ఎమ్ఎస్జీ వల్ల బరువు పెరగడం, తలనొప్పి, వికారం, అధిక రక్తపోటుకు దారి తీయవచ్చు.   

pexels

అధికంగా సోడియం- నూడుల్స్ లో సోడియం అధికంగా ఉంటుంది. సాధారంగా మన రోజువారీ సోడియం మొత్తంలో సగానికి పైగా నూడుల్స్ లో వాడతారు. అధిక సోడియం రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.   

pexels

  మైదా- ఇన్ స్టండ్ నూడుల్స్ ను మైదాతో తయారుచేస్తారు. మైదాలో డైటరీ ఫైబర్, పోషకాలు తక్కువగా ఉంటాయి. మైదా ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగల్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.

pexels

ఆరోగ్య సమస్యలు - ఇన్ స్టంట్ నూడుల్స్ ఎక్కువగా తింటుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.  

pexels

చెడు కొవ్వులు- ఇన్ స్టంట్ నూడుల్స్ తయారీలో పామాయిల్ లేదా ఇతర అనారోగ్య నూనెలు వాడతారు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.  గుండె నాళాల్లో కొవ్వు నిల్వలు పెరిగితే స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.   

pexels

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash