క్రికెటర్లకు విడాకులు ఇచ్చిన 5 మంది నటీమణులు వీరే!
By Sanjiv Kumar Jan 13, 2025
Hindustan Times Telugu
ఇటీవల విడాకులు తీసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రికెట్ రంగం కూడా దీనికి అతీతం కాదు. బాలీవుడ్ నటీమణులతో విడాకులు తీసుకున్నవారి సంఖ్యే ఎక్కువ.
శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్న తర్వాత యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే కూడా తమ భార్యలకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి.
బాలీవుడ్‌కి, క్రికెట్‌కి విడదీయరాని బంధం ఉంది. క్రికెటర్లు, నటీమణులు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కొందరు సంతోషంగా జీవిస్తుంటే, మరికొందరు వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.
భారతీయ క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన 5 మంది నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రీనా రాయ్ 1980లో పాకిస్థానీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోయింది.
indianewengland
మొహమ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ 14 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 2010లో విడిపోయారు.
మొహమ్మద్ షమీ 2014లో మోడల్, నటి హసిన్ జహాన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ, 2018లో విడిపోయారు.
హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంక్‌విక్ 2020లో వివాహం చేసుకున్నారు. 2024 జూలైలో విడాకులు తీసుకున్నారు.
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మల గురించి కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. 2020లో ధనశ్రీ- చాహల్ వివాహం చేసుకున్నారు.