ఇండియా, పాకిస్థాన్ మెగా మ్యాచ్ టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలివే

Photo: AFP

By Chatakonda Krishna Prakash
Oct 13, 2023

Hindustan Times
Telugu

వన్డే ప్రపంచకప్‍-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ తలపడేందుకు రెడీ అయ్యాయి. 

Photo: PTI

ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 14వ తేదీన మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 

Photo: PTI

అక్టోబర్ 14వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ మొదలుకానుంది. అంతకంటే ముందు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

Photo: AP

భారత్, పాకిస్థాన్ మ్యాచ్‍కు ముందు జరిగే స్పెషల్ సెర్మనీలో అర్జిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్విందర్ సింగ్ సహా మరికొందరు పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. లైట్ షో కూడా ఉండనుంది. 

Photo: BCCI

వన్డే ప్రపంచకప్‍లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ కానుంది. 

Photo: AP

డిజిటల్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ+ హాట్‍స్టార్‌లో ఉచితంగా లైవ్ చూడొచ్చు. 

Photo: PTI

ఈ మ్యాచ్‍లోనూ పాకిస్థాన్‍పై గెలిచి వన్డే ప్రపంచకప్‍ టోర్నీల్లో ఆ జట్టుపై అజేయ రికార్డును కొనసాగించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. 

Photo: ANI

కాలేయం మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Unsplash