మద్యం ప్రియులకు అత్యంత ఇష్టమైంది బీర్. పులియబెట్టిన బార్లీ, రైస్ ఆధారిత పదార్థాలు, పండ్లు, స్పైసెస్ తో బీర్ ను తయారు చేస్తారు.   

pexels

By Bandaru Satyaprasad
Dec 08, 2024

Hindustan Times
Telugu

ప్రస్తుతం మార్కెట్ లో క్లాసిక్ స్టౌట్‌, లాగర్‌ల నుంచి ఆపిల్ పళ్లరసం, కాఫీతో క్రాఫ్ట్ బీర్‌ల వరకు అనేక రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.  

pexels

రూ. 200 లోపు ధరలో 6 బెస్ట్ భారతీయ బీర్ బ్రాండ్‌ల గురించి తెలుసుకుందాం. 2023 స్టాటిస్టా నివేదిక ప్రకారం బీర్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మద్య పానీయం.  32% పట్టణ వినియోగదారులు బీర్ అంటే ఇష్టపడుుతున్నారు.   

pexels

 కింగ్ ఫిషర్ బీర్ -  కింగ్‌ఫిషర్ భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన బీర్ బ్రాండ్‌లలో ఒకటి. దీనిని యునైటెడ్ బ్రూవరీస్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.190గా ఉంది. ఏబీవీ శాతం 4.7-4.8. 

pexels

కరోనా ఎక్స్‌ట్రా ప్రీమియం బీర్ - ఫిల్టర్ వాటర్, మాల్టెడ్ బార్లీ, మొక్కజొన్న, ఈస్ట్ మిశ్రమం ఈ బీర్. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఇది ఒకటి.  ఇందులో ఆల్కహాల్ శాతం 5.30. ధర సుమారు రూ. 200(330ml)గా ఉంది.    

pexels

బడ్‌వైజర్ ప్రీమియం- దీనిని 21 రాత్రులు బేస్ట్ హాప్‌లు, బార్లీతో తయారుచేస్తారు. ఇందులో ఏబీవీ 5 శాతంగా ఉంటుంది. 650 ఎంల్ ధర సుమారు రూ. 170  

pexels

 బీరా 91 మలబార్ స్టౌట్- ఈ బీర్ తయారీలో మలబార్ హిల్స్ నుంచి సేకరించిన కాఫీ గింజలను ఉపయోగిస్తారు. వీటికి కాల్చిన రై, మెలనో మాల్ట్‌తో కలుపుతారు. ఈ బీర్ లో ఏబీవీ శాతం 4.5.  330 మి.లీ ధర సుమారు రూ. 130. 

pexels

కార్ల్స్‌బర్గ్ ఆల్ మాల్ట్ ప్రీమియం బీర్- ఈ బీర్‌ను ఉత్తమమైన యూరప్ హాప్‌లు, మాల్ట్‌తో తయారుచేస్తారు. పండ్లు, మసాలాలు వినియోగిస్తారు. ఈ బీర్ లో ఏబీవీ శాతం 5. దీని ధర సుమారు రూ. 130 (330 ml). 

pexels

 టుబోర్గ్ గ్రీన్ బీర్- పులియబెట్టిన లాగర్, పువ్వులు, ధాన్యాలతో తయారుచేస్తారు. ఇది రుచిలో మితమైన చేదు ఉంటుంది. దీని ఏబీవీ 4.6 శాతం, ధర సుమారు రూ. 120-130 (330 ml).(మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ వెబ్ స్టోరీ ఇంటర్నెట్ ఆధారిత సమాచారం) 

pexels

బరువు తగ్గేందుకు ఈ జ్యూస్.. ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు!

Photo: Pexels