ఊపిరితుత్తుల క్యాన్సర్ లక్షణాలు ఇవే.. అలా ఉంటే జాగ్రత్త పడండి!

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 11, 2025

Hindustan Times
Telugu

ఊపిరితిత్తుల (లంగ్స్) క్యాన్సర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా చాలా మంది మరణిస్తున్నారు. ప్రారంభ దశలో ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స ద్వారా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే శరీరంలో కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. 

Photo: Pexels

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు ఏవైనా అనిపిస్తే వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. నిర్దారించుకోవాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ముఖ్యమైన లక్షణాలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

మూడు వారాలకు మించి దగ్గు ఎక్కువగా కొనసాగుతుంటే ఊపిరితిత్తుల్లో సమస్యకు ఇది సంకేతం కావొచ్చు. అందుకే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. 

Photo: Pexels

దగ్గినప్పుడు కఫంలో రక్తం వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇలా జరిగితే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. 

Photo: Pexels

శారీరకంగా ఎలాంటి శ్రమ చేయకపోయినా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. శ్వాసలో సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.

Photo: Pexels

దగ్గుతున్నప్పుడు, శ్వాస గాఢంగా పీలుస్తున్నప్పుడు ఎక్కువగా ఛాతిలో నొప్పి వస్తుంటే ఇవి కూడా ఊపిరితిత్తుల్లో సమస్యను సూచిస్తాయి. తరచూ ఛాతి నొప్పి ఎక్కువగా వస్తుంటే టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి.

Photo: Pexels

బరువు హఠాత్తుగా ఎక్కువగా తగ్గినా.. తరచూ నీరసంగా అనిపిస్తున్నా ఇవి శరీరం క్యాన్సర్‌తో పోరాడుతున్న సంకేతాలుగా ఉండొచ్చు.

Photo: Pexels

బ్రాంకైటీస్, న్యుమోనియా తరచూ తీవ్రమవుతుంటే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ స్వరంలో ఎక్కువ కాలం తీవ్రమైన మార్పు, బొంగురుగా అనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

Photo: Pexels

ఈ ఆహారాలతో విటమిన్ బి 12 చాలా వేగంగా పెరుగుతుంది. వీటిని రోజూ తినండి