కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్న వేళ మీ ఇమ్యూనిటీని ఈ 9 రకాల పండ్లతో పెంచుకోండి

Image Credits : Adobe Stock

By Hari Prasad S
Jun 04, 2025

Hindustan Times
Telugu

దేశంలో మరోసారి కొవిడ్ 19 కేసులు 4 వేలకుపైగా అయిన నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం చాాలా ముఖ్యం. దీనికోసం తినాల్సిన 9 రకాల పండ్లు ఇవే

Image Credits : Adobe Stock

కమల లేదా సంత్ర పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలను పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేస్తుంది.

Image Credits : Adobe Stock

సులువుగా జీర్ణమయ్యే అరటి పండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఎక్కువగా ఉంటాయి. నాఢీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.

Image Credits : Adobe Stock

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి

Image Credits : Adobe Stock

బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. దీనికితోడు పాపైన్ అనే ఎంజైమ్ యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. జీర్ణ క్రియకు ఉపకరిస్తుంది.

Image Credits : Adobe Stock

ఫలాల రాజు మామిడి పండ్లలో విటమిన్ ఎ, ఇ, ఫొలేట్ ఉంటాయి. ఈ పండ్లు కూడా తెల్ల రక్త కణాలను వృద్ధి చేస్తాయి

Image Credits : Adobe Stock

పైనాపిల్‌లో విటమిన్ సి ఉంటుంది. బ్రొమెలైన్ అనే ఎంజైమ్ వల్ల యాంటీఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ బూస్టింగ్ గుణాలు ఉంటాయి.

Image Credits : Adobe Stock

పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది

Image Credits : Adobe Stock

ఆపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. మీ పొట్ట, ఇమ్యూనిటీ  ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image Credits : Adobe Stock

దానిమ్మలో యాంటిఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడి, రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Credits : Adobe Stock

పోలీసులకు చెమటలు పట్టించే సీరియల్​ కిల్లర్​- అదిరిపోయే ట్విస్ట్​లు.. ఓటీటీలో ది బెస్ట్​ క్రైమ్​, డిటెక్టివ్​ థ్రిల్లర్​ ఇది!