మూత్ర విసర్జనలో సమస్యలకు అసలు  కారణాలు ఏమిటి?

By Sarath Chandra.B
Feb 14, 2025

Hindustan Times
Telugu

మూత్రం రాక, పరిమాణం, స్వభావం, రంగులను బట్టి మూత్ర విసర్జనను కొన్ని రకాలుగా వర్గీకరించారు. మూత్రం లక్షణాలను బట్టి మూత్ర విసర్జన సమస్యలను గుర్తించవచ్చు.

మూత్రం ఎక్కువగా రావడాన్ని  పాలీయూరియా అంటారు.  మూత్రం అతిగా రావడం, పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రం పరిమాణం ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలను పాలీయూరియా అంటారు.

మూత్రం తక్కువగా రావడాన్ని అలిగురియా అంటారు. ఒకరోజులో తయారు కావాల్సిన  దానికంటే  తక్కువ మూత్రం  తయారైతే ఆ పరిస్థితి అలిగురియా అంటారు. 

50కిలోల బరువున్న మనిషి 3 గంటలలో 75మి.లీ మించకుండా మూత్రం తయారైతే అలిగురియాగా పరిగణిస్తారు.డీ హైడ్రేషన్‌ను సరిచేయాల్సి ఉంటుంది.

అనురియాలో మూత్ర పిండం కింద ఉండే మూత్రం దారులు మూసుకుపోతే మూత్ర పిండానికి వచ్చే రక్తం ఆగిపోతే మూత్రం అసలు తయారు కాదు. ఇతర జబ్బుల్లో ఎంతో కొంత మూత్రం తయారవుతుంది. 

 శరీరంలోని వ్యర్థపదార్ధాలు పోవాలంటే  రోజుకు 300-500 మి.లీ మూత్రం తయారవ్వాలి.  అంతకంటే తగ్గతే అనూరియా అంటారు.మూత్ర పిండాలు పనిచేయకపోవడం వల్ల అనూరియా  వస్తుంది.

మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ పదార్ధాన్ని పోవడాన్ని  అల్బుమినూరియా అంటారు. గ్లొమరూలో నెఫ్రైటిస్‌, డయాబెటిస్‌, నెఫ్రోటిక్ సిండ్రోమ్, కాన్పుకు ముందు వచ్చే గుర్రపు వాతం మొదలైన కారణాలతో అల్బుమినూరియా  వస్తుంది. 

రక్తంలో ఎక్కువా గ్లూకోజ్‌  ఉంటే మూత్రంలో కూడా గ్లూకోజ్ పోతుంది. అలాంటి పరిస్థితిని  గ్లైకోసూరియా అంటారు. 

మూత్రంలో రక్తం పోయే పరిస్థితిని హెమచూరియా అంటారు. మూత్ర పిండంలో రాళ్లు ఉండటం వల్ల, మూత్ర నాళానికి గాయాలైనా, ఇన్‌ఫెక్షన్లు సోకడం వల్ల ఈ సమస్య వస్తుంది

పుట్టుకతో మూత్ర పిండాల జబ్బుల వల్ల,  మూత్రపిండాల క్యాన్సర్‌, ప్రోస్టేట్ సమస్యలు, క్యాన్సర్ చికిత్సల వల్ల హెమచురియా వస్తుంది.

మూత్రంలో చీము పోయే పరిస్థితిని పయూరియా అంటారు. 

మూత్రపిండాల్లో, మూత్ర కోశంలో చీము చేరుతుంది.  ఇందులో నడుము నొప్పి, మూత్రం పోసే సమయంలో నొప్పి ఉంటాయి. 

మూత్రం కల్చర్‌, సెన్సిటివిటీని బట్టి మూత్ర సమస్యలను నిర్దారిస్తారు.మూత్రం పోవడానికి నిర్దిష్ట కారణాలను గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. 

హైదరాబాద్ టు వయనాడ్ ట్రిప్ - ఈ టూర్ ప్యాకేజీ చూడండి

image credit to unsplash