మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇనుము లోపం ఉన్నట్టే

By Haritha Chappa
Mar 16, 2025

Hindustan Times
Telugu

ఇనుము లోపిస్తే శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఇనుము లోపించడం వల్ల శరీరంలో ఎన్నో పనులు చేయలేక ఇబ్బంది పడుతుంది.

విపరీతమైన అలసటగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా అలసటగానే ఉంటుంది.

మీ ముఖం, కంటిలోని భాగం, గోళ్లు వంటివి పాలిపోయినట్టు అవుతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల ఇలా రంగు మారుతాయి.

శరీరంలో ఇనుము లోపిస్తే అప్పుడప్పుడు శ్వాస ఆడనట్టు అనిపిస్తుంది.

తరచుగా తలనొప్పి వస్తున్నా కూడా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడం లేదని అర్థం. దీనికి ఇనుములోపం కారణం కావచ్చు.

గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమరహితంగా కొట్టుకోవడం కూడా  ఇనుము లోపానికి సంకేతమే.

గోళ్లు పెళుసుగా మారి విరిగిపోయినట్టు అవుతాయి.

ఇనుము లోపిస్తే మట్టి, ఐసుగడ్డలు తినానిపిస్తుంది.

జుట్టు రాలిపోవడానికి కూడా ఇనుము లోపం కారణం కావచ్చు.

చేతులు, కాళ్లు చల్లగా మారిపోతూ ఉంటాయి.

ఏ విషయంపైనా ఏకాగ్రత కుదరదు. 

ఇనుము కోసం బీన్స్, పాలకూర, కొమ్ము శెనగలు, క్వినోవా, గుమ్మడి గింజలు, చికెన్ లివర్, టోఫు, ఎండుద్రాక్ష వంటివి అధికంగా తినాలి.

ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు

అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే

PINTEREST, EATING WELL